మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

శ్రీ వేంకటేశ్వర లీలలు


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥


మాతస్సమస్త జగతాం మధుకైటభారేః

వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥


తవ సుప్రభాతమరవింద లోచనే

భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।

విధి శంకరేంద్ర వనితాభిరర్చితే

వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥


అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 5 ॥


పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి ।

భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 6 ॥


ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాలికానాం ।

ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 7 ॥


ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని ।

భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 8 ॥


తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా

గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।

భాషా సమగ్ర మసకృత్కరచారు రమ్యం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 9 ॥


భృంగావళీ చ మకరంద రసాను విద్ధ

ఝుంకారగీత నినదైః సహసేవనాయ ।

నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 10 ॥


యోషాగణేన వరదధ్ని విమథ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 11 ॥


పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః ।

భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 12 ॥


శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।

శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥


శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః

శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః ।

ద్వారే వసంతి వరవేత్ర హతోత్త మాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 14 ॥


శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ।

ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 15 ॥


సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః ।

బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 16 ॥


ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః ।

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 17 ॥


సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి

స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।

త్వద్దాసదాస చరమావధి దాసదాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 18 ॥


తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః ।

కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 19 ॥


త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః ।

మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 20 ॥


శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే

దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే ।

శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 21 ॥


శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే ।

శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 22 ॥


కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే

కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।

కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 23 ॥


మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర ।

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 24 ॥


ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణం ।

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం ॥ 25 ॥


భాస్వానుదేతి వికచాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ।

శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ॥ 26 ॥


బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ।

ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 27 ॥


లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో ।

వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 28 ॥


ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।

తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం

ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1'''''''


తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2'


తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.


మాతః సమస్త జగతాం మధుకైటభారే:

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3'


తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.

తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే

వృషశైలనాద థయితే దయానిధే. 4


తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.

అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్‌ 5


తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 6


తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధై

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 7


తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదలీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 8


తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!

తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయన్త్యనంత చరితం తవ నారదో7పి

భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 9


తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.

భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ

నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 10


తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 11


తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 12


తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 13


తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః

శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 14


తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం

ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 15


తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః

బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 16


తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 17


తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ­ు సుప్రభాతమగు గాక.

సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి

స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః

త్వద్దాస దాస చరమావధిదాస దాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 18


తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా

కల్పాగమా7కలనయా కులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 19


తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 20


తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే

దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 21


తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 22


తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే

కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే

కల్యాణనిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 23


తా. మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్‌

స్వామిన్‌ పరశ్వథ తపోధన రామచంద్

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 24


తా. ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరితిహేమఘటేషు పూర్ణం

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్ఠాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌ 25


తా. ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

భాస్వానుదేతి వికటాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః

శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్‌ 26


తా. ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః

ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 27


తా. ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో

వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 28


తా. ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్‌ (ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్‌- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం

ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే


తా. వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.


శ్రీ వేంకటేశ స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో

నియ తారుణి తాతుల నీలతనో

కమలాయత లోచన లోకపతే

విజయీ భవ వేంకటశైల పతే 1


తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.


స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ

ప్రము ఖాఖిలదైవత మౌళిమణే

శరణాగత వత్సల సారనిధే

పరిపాలయ మాం వృషశైల పతే. 2


తా. ఓ దేవా! నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు. శరణాగత వత్సలుడవు. బలమునకు నిధివి. ఓ వృషశైలాధిపా! నన్ను పాలింపుము.


అతి వేలతయా తవ దుర్విషహై

రనువేలకృతైరపరాధ శతైః

భరితం త్వరితం వృషశైలపతే

పరయా కృపయా పరిపాహి హరే. 3


తా. ఓ దేవా! హద్దులేనివియు, నీకును సహింప శక్యము కానివియు అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము.

అధి వేంకటశైల ముదారమతే

ర్జన తాభిమ తాధిక దాన రతాత్‌

పర దేవతయా కథితా న్నిగమైః

కమలా దయితా న్న పరం కలయే. 4


తా. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వేంకటాచలమున నివసించు ఉదారబుద్ధి కలవాడు, వేదములచేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వేంకటేశ్వరుని కంటె గొప్ప దైవము లేడు.

కలవేణు రవా వశ గోపవధూ

శతకోటి వృతా త్స్మరకోటి సమాత్‌

ప్రతివల్ల వికాభిమతా త్సుఖదాత్‌

వసుదేవసుతాన్న పరం కలయే. 5


తా. మధురమైన వేణునాదము వలన పరవశత పొందిన కోట్లకొలది గోపికలచే చుట్టుకొనబడినవాడును, కోటి మన్మథుల చక్కదనము కలవాడును, గొల్లపడుచుల కందరికిని ఇష్టుడును, సుఖముల నిచ్చువాడును అగు వాసుదేవుని కంటె గొప్ప దైవము లేడు.

అభిరామ గుణాకర దాశరథే

జగదేక ధనుర్ధర ధీరమతే

రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయాజలధే. 6


తా. ఓ రామా! రఘునాయకా! దాశరథీ! నీవు మనోహరములైన గుణములకు నిధివి, లోకమంతటికిని సాటిలేని ధనుర్ధురుడవు. ధీరుడవు. లక్ష్మికి భర్తవు. దేవుడవు. ఓ దయాసముద్రుడా! వరములొసగి నన్నుద్ధరింపుము.

అవనీ తనయా కమనీయకరం

రజనీకర చారు ముఖాంబురుహమ్‌

రజనీచర రాజ తమోమిహిరం

మహనీయ మహం రఘురామ మయే. 7


తా. ఓ దేవా! నీవు సీతాదేవికి ప్రియుడవు. చంద్రునివలె చక్కని ముఖము కలవాడవు. రాక్షస రాజగు రావణుడనెడి చీకటిని పోగొట్టు సూర్యుడవు. మహనీయుడవు. ఓ రామా! నన్ను రక్షింపుము.

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్‌

అపహాయ రఘూధ్వహ మన్య మహం

న కథంచన కంచన జాతు భజే. 8


తా. చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడును, సులభుడును, సుఖముల నిచ్చువాడును, అనుకూల సోదరులు కలవాడును అగు శ్రీ రామచంద్రుని విడచి, నేను ఒకప్పుడును, ఎట్టి స్థితిలోను వేరొక దేవుని సేవింపను.

వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. 9


తా. వేంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనేలేదు. నే నెల్లప్పుడును వేంకటేశ్వరునే స్మరించుచుందును. ఓ హరీ! వేంకటేశ్వరా! అనుగ్రహింపుము. ఓ వేంకటేశ్వరా! నాకు ప్రియమును తప్పక కలుగజేయుము.

అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ

ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి

సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం

ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ. 10


తా. ప్రభుడవైన ఓ వేంకటేశ్వరా! నీ పాద పద్మములకు నమస్కరించవలెనను కోరికతో నేనెంతో దూరము నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు, నిత్యసేవ చేయుటవలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపుము.

అజ్ఞానినా మయా దోషా

నశేషా న్విహితాన్‌ హరే

క్షమస్వ త్వం క్షమస్వ త్వం

శేషశైల శిఖామణే. 11


తా. ఓ శేషశైలవాసియగు హరీ! నేను మూఢుడనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము.


శ్రీ వేంకటేశ ప్రపత్తిః

ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్

తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్‌ క్షాంతి సంవర్థనీమ్‌

పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం

వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్‌. 1


తా. ఈ లోకములకు ఆధారమైనదియు, శ్రీ వేంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలును, అతని వక్షస్థలమందు నిత్యము నివసించుటచే ఆనందించునదియును, అతని యోరిమిని వృద్ధి చేయునదియును, రెండు హస్తములందును కమలములను ధరించునదియును పద్మాసనమున ఉండునదియును, వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునదియు, భగవతియు, లోకములకు తల్లియు అగు లక్ష్మీదేవికి నమస్కార మొనర్తును.


శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక

సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌

స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 2


తా. శ్రీమంతుడవగు వేంకటేశ్వరా! నీవు దయాసముద్రుడవు. సమస్త లోకములకు సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తుడవు. సేవించువారి యెడల వాత్సల్యము కలవాడవు. సర్వస్వతంత్రుడవు. ప్రభువైనవాడవు. సుగుణములు కలవాడవు. ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షమవు. నీ పాదములనే శరణుజొచ్చెదను.

ఆనూపు రార్చిత సుజాత సుగంధి పుష్ప

సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ

సౌమ్యౌ సదానుభవనే పి నవానుభావ్యౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 3


తా. అందెలవరకును వ్యాపించిన మేలిరకపు పూల సువాసనచే పరిమళించునవియు, పొందికగా ఉన్నవియు, అందమైనవియు, నిత్యము చూచుచునే యున్నాను. క్రొత్తగా నుండి మనస్సును ఆకర్షించునవియు అగు శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు జొచ్చెదను.

సద్యో వికాసి సముదిత్త్వర సాంద్రరాగ

సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్‌

సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 4


తా. అప్పుడే వికసించి, మనోహరముగా నుండి, ఎక్కువ పరిమళముతో నిండియున్న కమలముల పోలికలను సత్యముగా సాహసమే అని వెల్లడించుచున్న శ్రీ వేంకటేశవ్రుని పాదములనే శరణు పొందెదను.

రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర

వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః

భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 5


తా. పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృతకలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడియున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ

బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ

ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 6


తా. పద్మరాగములను మించిన అరపాదములును, ఇంద్రనీలములను అతిక్రమించిన కాంతిగల మీగాళ్లును, చంద్రుని కాంతిని మించిన కాంతి గల గోళ్ళును కల శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.

స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం

సంవాహనేపి సపది క్లమ మాదధానౌ

కాంతావవాఙ్మనసగోచర సౌకుమార్యౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 7


తా. లక్ష్మీదేవి మిక్కిలి ప్రేమతోను, భయముతోను తన మృదువైన చిగురు హస్తములతో భద్రముగా ఒత్తుచున్నా శ్రీ వేంకటేశ్వరుని పాదములు కందిపోవును. అవి మిక్కిలి సుందరములై చెప్పుటకుగాని, ఊహించుటకు గాని సాధ్యపడని సౌకుమార్యము కలిగియుండును. అట్టి పాదములనే శరణు పొందెదను.

లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ

నీలాది దివ్య మహిషీ కరపల్లవానామ్‌

ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 8


తా. శ్రీదేవి, భూదేవి వారితో సమానులగు నీలాదేవి మున్నగు భార్యల పాదపల్లవముల ఎఱ్ఱని కాంతి సంక్రమించుటచేతనో యనునట్లుగా మిక్కిలి ఎఱ్ఱగా వున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణుజొచ్చెదను.

నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి

ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః

నీరాజనా విధి ముదార ముపాదధానౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 9


తా. ప్రతిదినము నమస్కరించుచున్న శివుడు మున్నగు దేవతల కిరీటముల అగ్రభాగమునందు ఉన్నట్టివియు, మిక్కిలి ప్రకాశించునట్టివియు అగు నవరత్నములకాంతి సమూహమువలన నీరాజనమును పొందుచున్నవేమో అనునట్లు శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణు వేడెదను.


"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ

యౌ 'మధ్వఉత్స' ఇతి భోగ్యతయా 7ప్యుపాత్తౌ

భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 10


తా. ఓ వేంకటేశ్వరా! నీ పాదములు 'విష్ణోః పదే పరమ' అని ఋగ్వేదమున స్తుతింపబడినది. 'మద్య ఉత్స' అని తేనెయూటలుగా, అను భవయోగ్యములుగా చెప్పబడినది. 'ఆ మాట వాస్తవము' అని తిరిగి నీవే నీ హస్త సంజ్ఞతో తెలుపుచున్నావు. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను.

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ

యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి

భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 11


తా. ఓ వేంకటేశ్వరా! అర్జునునకు తగిన సారథివైన నీవు అతనికి 'నా పాదములనే శరణు పొందుము' అని హితమును ఉపదేశించితివి. ఆ పాదములనే ఇప్పుడు నాకును 'శరణు పొందుము' అని హస్తములతో చూపుచున్నావు. అట్టి నీ చరణములనే శరణు పొందెదను.


మున్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు

శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్‌

చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 12


తా. ఓ వేంకటేశ్వరా! నా తలపైని, కాళీయుని పడగపైని, దుర్గమారణ్యములందును, శ్రీ వేంకటాచలము యొక్క శిఖరముపైని, ఉపనిషత్తుల యందును, వేఱే ఆలోచన లేక నిన్నే స్మరించువారి మనస్సునందున, నీ పాదములు భేదములేక సమానముగనే ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడెదను.

ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ

శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ

ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 13


తా. ఓ వేంకటేశ్వరా! భూమిపైని, అంతటను చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవియు, శ్రీ వేంకటాచల శిఖరమునకు అలంకారమైనవియు, జనులందరి మనస్సులకు, నేత్రములకు ఆనందమును కల్గించునట్టివియు అగు నీ పాదములనే శరణు వేడెదను.

ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ

మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ

ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 14


తా. ఓ వేంకటేశ్వరా! ఆర్తులగు జనులకు సదా తొట్టతొలుత సేవింపదగినవియు, బిడ్డకు తల్లి యొక్క స్తనములవలె జనుల కమృతము వంటివియు, పరస్పరము పోలిక కలవియు, వేరొక వస్తువుతో పోలిక లేనివియు అగు నీ చరణములనే శరణువేడెదను.

సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన

సంసార తారక దయార్ద్ర దృగంచలేన

సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 15


తా. ఓ వేంకటేశ్వరా! సాత్త్వికగుణము గల వారిచే సేవింపబడువాడును, సంసారమును తరింపజేయు దయామయమగు కడకంటి చూపు కలవాడును అగు మణవాళ మహాముని చేత నే నీ పాదములు నాకు చూపబడినవి. అట్టి నీ పాదముల నే నేను శరణువేడెదను.

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే

ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా

నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం

స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్‌. 16


తా. ఓ వృషశైవాధిపతీ! లక్ష్మీపతీ! మోక్ష మార్గమునకు నీవే ఉపాయభూతుడవు, నీవే ప్రాప్యుడవు. లక్ష్మీ దేవి నిన్నెల్లప్పుడును ఆశ్రయించి యుండుటవలన, ఆమెయును ఉపాయభూతురాలనును, ప్రాప్యురాలును అగుచున్నది. దోషరహితములైన గుణములు కల నీకే నేను సేవకుడనగుచున్నాను.


శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్‌

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌.


తా. లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌.


తా. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే

మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్.


తా. శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వేంకటేశవ్రునకు మంగళమగు గాక.

సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం

సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్‌.
తా. సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌.
తా. నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక.

స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌.


తా. స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు,

సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్‌.


తా. పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


కాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌

అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్‌.


తా. కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృతస్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా

కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌.


తా. పురుషులందరికిని తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః

ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌.


తా. దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపజేసి జీవలోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే

సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌.


తా. తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రములవలనను, ఆయుధములవలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌.


తా. శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే

సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌.


తా. శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక!

నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే

వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్‌.


తా. శుద్ధజ్ఞాన స్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు శ్రీ కి నివాసస్థానమైన శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః

సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్‌.


తా. మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.

తిరుమల పూర్వ చరిత్ర

కలియుగ వైకుంఠమని పేరుపొందిన దివ్యక్షేత్రము తిరుమల-తిరుపతి. ఇది శ్రీ వేంకటేశ్వరుడని పిలువబడుచున్న శ్రీనివాసుని నివాస స్థలము. ఈ క్షేత్రమునకు- శేషాద్రియని, వేదాచలమని, గరుడాచలమని, వృషభాద్రియని, ఆంజనాద్రియని, ఆనందాద్రియని, వేంకటాచలమనికూడ పేర్లు కలవు. ఈ పర్వతము వేదములచే నిండియుండుటవలన “వేదాచలము” అను పేరు పొందినది.

గరుడాచలము అను పేరుపొందిన విధము

చాలాకాలము క్రిందట బ్రహ్మదేవుడు నిద్రించుచున్న సమయమున హిరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని చాపవలెచుట్టి రసాతలమునకు ఈడ్చుకొని పోయి హింసించసాగెను. కొంతకాలమునకు బ్రహ్మదేవుడు నిద్రనుండి మేల్కొని ఆ సంగతి తెలిసికొని విచారించెను. భూదేవికి కలిగిన కష్టము తొల గించమని విష్ణువును ప్రార్థించెను. ‘బ్రహ్మ ప్రార్ధన విని విష్ణుదేవుడు శ్వేతవరాహ రూపముదాల్చి రసా తలమునకు పోయి హిరణ్యాక్షుని వధించి, భూమిని రక్షించి యధాస్థానమున నిలి పెను. బ్రహ్మను పిలిచి తిరిగి సృష్టి ప్రారంభించమని ఆజ్ఞాపించెను.
'అప్పుడు బ్రహ్మాది దేవతలు వరాహ రూపమున నున్న విష్ణువును అనేక విధముల స్తుతించి కొరతలను పూరొక మనువు నివహించి ధర్తను


వరాహ రూపముదాల్చి హిరణ్యాక్షుని వధించి భూదేవిని కాపాడుచున్న విష్ణుమూర్తి కాపాడమని కోరినారు. విష్ణుదేవుడు వారి ప్రార్థన కంగీకరించి, తాను భూమిపై నివసించుటకు తగిన స్థలము లేనందున గరుత్మంతునితో వైకుంఠమున నున్న క్రీడాద్రిని" తెప్పించి దానిపై భూదేవి సహితముగ నివసించుచు భక్తులను రక్షించుచుండెను. ఆ క్రీడాద్రియే నేడు తిరుమల అని చెప్పుకొనబడుచున్న పర్వత రాజము. గరుత్మంతునిచే తేబడినదిగాన 'గరుడాచల' మనబడుచున్నది.

వృషభాద్రి అను పేరుపొందిన విధము

పూర్వము వృషభాసురుడను రాక్షసుడు గరుడాచలముపై నివసించి సృసింహసాల గ్రామమును పూజించుచుండెను. అతడు ప్రతిదినము పూజ పూర్తి అయిన తరువాత ఖడ్గముతో తన తలను ఖండించి పుష్పములతో ఆ శిరస్సును సాల గ్రామమునకు సమర్పించుచుండెను. పూజ సంపూర్ణమైన తరువాత అతని శిరస్సు యధాపూర్వకముగ వచ్చుచుండెను. వృషభాసురు డిట్లు కొన్ని వేల సంవ త్సరములు తపస్సు చేసెను. కొంతకాలమునకు విష్ణుదేవుడు అతనిపై కరుణించి ప్రత్యక్షమై "వృషభాసురా! నీ తపస్సునకు మెచ్చితిని- నీకు కావలసిన వరమడుగుము” అని పలికెను. వృషభాసురుడు విష్ణుదేవుని మాటలువిని ఆనందించి "స్వామీ! నాకు స్వర్గముగాని, ఇంద్రపదవిగాని అవసరములేదు. మీతో యుద్ధము చేయవలెనని కోరుచున్నాను" అని చెప్పెను. విష్ణుమూర్తి అతని కోరికవిని ఆశ్చర్యపడి “అట్లే వరమిచ్చితిని. ఇక తపస్సుమాని యుద్ధమునకు రమ్ము" అని పలికెను. అంతట వృషభాసురుడు తపస్సుకు స్వస్తిచెప్పి విష్ణుమూర్తితో యుద్ధము చేయుటకు సిద్ధపడెను. వృషభా సురుడు విష్ణుమూర్తి కేమాత్రము తీసిపోక భయంకరముగా పోరాడసాగేను. అప్పుడు విష్ణుమూర్తి అనేక రూపములు దాల్చి పృషభాసురునితో పోరాటము సాగించెను. విష్ణుదేవుడు ఏ రూపంతో, ఏ ఆయుధంతో పోరాడుచుండెనో వృష భాసురుడుకూడ ఆ రూపంతో, అదే ఆయుధంతో పోరాడుచుండెను. ఇట్లు వార అనేక వత్సరములు యుద్ధముచేసిరి.
వృషభాసురుడు ఎంతకాలం పోరాడినను లొంగనందున విష్ణుమూర్తి తుదకు అతనిపై చక్రమును విడిచెను. ఆ చక్రాయుధము మహిమ ముందే యెరిగియున్న వృషభాసురుడు తనకిక చావు తప్పదని గ్రహించి విష్ను దేవున చూచి "స్వామీ! నీ చక్రాయుధమువలన నేను చంపబడి స్వర్గమున కేగరతప్పదు. ఆ పని జరుగకముందే నా కోరిక ఒకటి తీర్చమని ప్రార్థించుచున్నాను. అది యేమనగా, మీరు నివసించుచున్న ఈ పర్వతమునకు, 'వృషభాద్రి' అను పేరు కలుగునట్లు అనుగ్రహింపుడు" అని కోరెను. విష్నుదేవుడు అట్లే కాగలడని చెప్పెను. అంతలో చక్రాయుధమువచ్చి వృషభాసురుని కంఠమును ఖండించెను. విష్ను దేవుడు అతనికి మోక్షమిచ్చెను. వృషభాసురుని కోరిక సనుసరించి గరుడా చలమునకు 'వృషభాద్రి' అను పేరుకూడ కలిగెను.

అంజనాద్రి అను పేరుపొందిన విధము

పూర్వము అంజనాదేవి అనునామె తనకు సంతానంలేని కారణమున మతంగ మహామునివద్దకు వెళ్ళి తనకు సంకానం కలుగు మార్గము తెలుపుడని ప్రార్ధించెను. మతంగముని ఆమె కోరికవిని "అమ్మా! పంపా సరోవరమునకు అరువది యోజనముల దూరమున గరుడాచలము అను గొప్ప పర్వతము కలదు. అచ్చట ఆది వరాహమూర్తి నివసించి భక్తుల కోరికలను తీర్చు చున్నాడు. నీవు ఆ దివ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానంచేసి, కొంతకాలం తపస్సు చేసినచో నీకు తప్పక సంకానం కలుగగలదు". అని చెప్పెను.
మతంగ మహాముని మాటలువిని అంజనాదేవి చాల సంతోషించి, "ఆయనవద్ద శలవు తీసుకొని తక్షణం గరుడాచలమునకు వెళ్ళినది. అచ్చట స్వామి పుష్కరిణిలో స్నానంచేసి, ఆకాశగంగ తీర్థముగల ప్రదేశమున నిలచి, నిద్రా హారములు మాని తపస్సు నారంభించినది.
అట్లు తపస్సు చేయుచున్న అంజనాదేవికి. ఒకనాడు వాయుదేవుడు ప్రత్యక్షమై ఒక పండునిచ్చి "అంజనా దేవీ! ఈ ఫలమును భుజించినచో నీకు మహా బలపరాక్రమములుగల పుత్రుడు పుట్టగలడు. అతడు మహా భక్తుడై గొప్ప కీర్తి పొందగలడు" అని పలికి, ఆమె నాశీర్వదించి మాయమయ్యెను.
వాయుదేవుని మాటలువిని అంజనాదేవి ఎంతో ఆనందించెను. తక్షణమే ఆ ఫలమును భుజించెను. స్వల్ప కాలంలోనే ఆమె గర్భముదాల్చి వాయువు వంటి బలపరాక్రమములుగల పుత్రుని కనెను. ఆ పుత్రునకు ఆంజనేయుడను పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచి పెద్దగా చేసెను. ఆ ఆంజనేయుడే కాలక్రమమున శ్రీరా మునకు నమ్మినబంటే, సాటిలేని రామభక్తుడై ఆ చంద్రార్కమగు కీర్తి నార్జిం చెను. అంజనాదేవి తపస్సుచేసి ఆంజనేయునికన్న ప్రదేశమగుటచే గరుడాచలము నకు 'అంజనాద్రి' అను పేరుకూడ కలిగెను.

శేషాద్రి- అసుదాద్రి-అను పేర్లుపొందిన విధము

విష్ణుమూర్తి వైకుంఠమునందు లక్ష్మి దేవితో పదం కంగానున్న సమ యాన వాయుదేవుడు ఆయనను దర్శించుటకు వచ్చెను. అప్పుడాయనను ద్వారము వద్ద కావలియున్న ఆది శేషుడు లోనికి వెళ్ళుటకు వీలులేదని అడ్డగించెను. “నే నిప్పుడు అత్యవసరమగు కొన్ని విషయాలు విష్ను దేవునకు చెప్పవలసి యున్నది కావున నన్ను లోనికి పోనిమ్ము" అని వాయువు యెంత ఆడిగినను ఆది శేషుడు ఆయనను లోనికి పోనివ్వలేదు. అంతట వారిద్దరిమధ్య కలహము పుట్టి తీవ్రమైన వాగ్వాదములు చెలరేగినవి. ఆదిశేషుడు, వాయుదేవుడు కలహపడుచున్న విషయమును లక్ష్మిదేవి గ్రహించి, ఆ సంగతి విష్నుమూర్తికి చెప్పినది. అంతట విష్నుదేవుడు వారి వద్దకు వెళ్ళి వాయువును చూచి "గర్విష్టియగు శేషునితో నీవు కలహపడుట తగదు" అని మందలించెను. విష్ను దేవుని మాటలువిని వాయువు శాంతించి తన అపరాధమును క్షమించమని కోరెను. కాని ఆది శేషుడు మాత్రం శాంతించలేదు. వాయువుకంటే కానే బలం కలవాడనని గర్వంతో ప్రగల్భాలు పలుకసాగెను.
విష్ణు దేవుడు ఆది శేషుని మాటలు విని ఆగ్రహించి "ఓయీ! పట్టి మాటలతో నేమిలాభం? మీ యిద్దరిలో ఎవరు జలవంతులో తెలిసికొనుటకు నేనొక మార్గం చెప్పెదను. ఆ ప్రకారం చేసినచో మీలో ఎవరు బలవంతులో నిర్ధారణ కాగలదు. అదేమన, మహామేరువు పుత్రుడగు ఆనందుని ఆదిశేషుడు చుట్టుకొని ఉండవలెను. వాయువు తన బలము నుపయోగించి ఆనందుని కదలించు టకు ప్రయత్నించవలెను. శేషుడు చుట్టుకొనియున్న ఆనందుడు కదలిసచో వాయువు బలవంతుడనీ, అనందుడు కదలక అట్లే ఉన్నచో శేషుడు బలవంతుడని నిర్దారణ కాగలదు" అనగా, ఆదిశేషుడు అట్లే చేయుదమనెను. తక్షణమే ఆది శేషుడు ఆనంద పర్వతంవద్దకుపోయి దానిని చుట్టుకొని కదలకుండా గట్టిగా నొక్కి పట్టుకొని యుండెను. వాయువు ఆ పర్వతమును కది లించవలెనని తీవ్రంగా వీచసాగాను. వాయువు ఎంత ప్రయత్నించినను శేషుడు ఆ పర్వతమును కదలనీయక గట్టిగా చుట్టుకొని కాపాడుచుండెను. వాయువు మరింత - తీవ్రంగా వీచసాగెను. ఆ గాలికి ఆగలేక చెట్లు, పుట్టలు, కొండలు మున్నగునవి ఎగిరిపోవుచుండెను. త్రిలోకవాసులు ఆ పెనుగాలికి తట్టుకొనలేక గజగజ వణికిపో సాగిరి.
అంతట దేవతలు వాయు దేవుని శాంతింపుమని కోరిరి. "మీ యిద్దరి పట్టుదలలవల్ల మూడులోకాలకు నష్టం కలుగుచున్నది. లోకులు తమ ప్రాణాలను అరచేతులందు పట్టుకొని బాధపడుచున్నారు. కావున శాంతింపుము" అని కోరి నారు. దేవతలు ఎంత కోరినను వాయువు తన పట్టుదల విడువలేదు. ఆదిశేషుని గర్వమణచవలెనను తలంపుతో మరింత గట్టిగా వాయువు వీచసాగెను. దేవతలప్పుడు ఆదిశేషుని చూచి "ఆది శేషా! నీవైనను పట్టుదల విడచి లోకములను కాపాడుము" అని కోరిరి. శేషుడు వారి ప్రార్థన కాదనలేక తన . శిరస్సు నొకదానిని యెత్తెను. అంతట పట్టుతప్పిన ఆనంద పర్వతము పెనుగాలికి తట్టుకొని నిలువలేక ఆకాశమార్గాన నెగిరిపోవు చుండెను. అప్పుడు మేరువు తన కుమారునకు కలిగిన కష్టమును తొలగించుమని వాయుదేవుని ప్రార్థించెను. వాయువు మేరువు ప్రార్థన విని జాలిపడి ఆనంద పర్వతమును స్వర్ణ ముఖీ నదికి ఉత్తర భాగానగల వరాహ క్షేత్రమున నిలిపెను. అప్పుడు దేవతలు వాయుదేవునిచూచి “వాయు దేవా! ఆది శేషుడు విష్ను మూర్తి అంతరంగుడు, ఆయ నతో నీవు కలహం పెట్టుకొనుట మంచిదికాదు. నీవు శేషుని ఆశీస్సులను పొంద వలెను, కపట నాటక సూత్రధారియగు విష్నుదేవుడు తన కార్యము నెర వేర్చు కొనుటకు మిమ్మిట్లు పురిగొల్పి మీ ద్వారా ఆయన భూలోకాన నివసించుటకు మేరు పుత్రుడగు ఆనందుని యిచ్చటికి చేర్పించినాడు" అని చెప్పగా, వాయు దేవుడు ఆనందించి, ఆదిశేషుడకు నమస్కరించి "భగవానుడు మనలను యిట్లు ప్రోత్సహించి తన నివాసం కొరకు ఆనంద పర్వతమును తెప్పించుకొనేను. ఈ రహస్యం తెలిసికొనలేక మనం వృధాగా తగవు పడినాము. నన్ను మన్నింపుము" అనగా, ఆది శేషుడు ఆనందించి, వాయువు నాశీర్వదించి పూర్వంవలె స్నేహంగా ఉండసాగెను. ఆనాటినుండి గరుడాచలమునకు “శేషాద్రి" అని, "ఆనందాద్రి” అని పేర్లు కలిగినవి.

వేంకటాచలము అను పేరుకలిగిన విధము

పూర్వం కాళహస్తిలో పురందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు మాధవుడు అను కుమారుడు కలిగెను. మాధవునకు ఆయన సకల శాస్త్ర ములు, పురాణాలు చెప్పించెను. గుణవంతురాలగు కన్యనుచూచి వివాహం గావిం చెను. వారు ఆనందంగా కాలం గడుపుచుండిరి. ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి, గౌరవంగా చూడజడుచుండిరి...
కొంతకాలానికి పురందరుడు మరణించెను. మాధవుడు తండ్రికి శాస్త్రో క్తంగా కర్మక్రియలు జరిపించెను. భార్యతో అన్యోన్యానురాగములు కలిగి ఆసం దంగా జీవించుచూ, శ్రద్ధాభక్తులకో దైవకార్యాలు చేయుచుండెను. ఇట్లు జరుగుచున్న సమయాన మాధవుడు ఒకనాడు పుష్పములు కోసి; తెచ్చుటకై అడవికి వెళ్ళెను. అప్పుడతనికి ఆ వనములో ఒక చండాల స్త్రీ కన బడెను. మాధవుడు ఆమె అందచందములుచూచి ముగ్ధుడయ్యెను. ఆమె యెంత చెప్పిననూ వినక “నీవు నా పాలిటి దేవకన్యవు కాని చండాల స్త్రీవి కావు" అని మెచ్చుకొని, ఆ చండాల కాంతతో కాపురం చేయుచు, ఆమె యింటిలోనే ఉండి పోయెను. అగ్నిసాక్షిగ వివాహమాడిన కన్యను అష్టకష్టములపాలు గావించెను, ఇట్లాతడు మహా పాపియైనాడు. కొన్నాళ్ళకు మాధవుని ప్రియురాలగు చండాలకాంత అకస్మాత్తుగా మరణించినది. మాధవుడు ఆమె చనిపోయినందున తీరని దుఃఖమునకు గురి యైనాడు. తుఃఖం భరించలేక పిచ్చివాడై ఊరూరు తిరుగుచు బిచ్చమెత్తు కొని జీవించసాగెను. ఇట్లు పిచ్చివాడై ఊరూరు తిరుగుచున్న మాధవుడు కొందరు యాత్రి కుల వెంటబడి శేషాద్రిని చేరినాడు. కపిల తీర్థమున స్నానంచేసిన తక్షణం మాధ వుని చండాలత్వం తొలగినది. అతని సమస్త పాపాలు నశించినవి. దివ్యజ్ఞానం కలిగినది. పిమ్మట మాధవుడు శేషాద్రిపై కేగి స్వామి పుష్కరిణిలో మునిగి పైకి లేచినంతలో శ్రీనివాసుడు ప్రత్యక్షమై “ఓయీ, నీవు పాపరహితుడవైతివి.
నీ చండాలత్వం నశించినది. ముందుజన్మలో నీవు పాండవ వంశమందు పుట్టిన సుధర్మరాజు పుత్రుడవై పుట్టి చోళరాజ్యమును పాలించగలవు, సాక్షాత్తు లక్ష్మి దేవి నీకు పుత్రికగా లభించగలదు. ఆమెను నాకు యిచ్చి వివాహంచేసి శాశ్వత మైన కీర్తి నార్జించగలవు. ముక్తి పొందగలవు" అని పలికి. ఆశీర్వదించి అదృశ్య మయ్యెను. ఆ మాధవుడే కొంత కాలానికి ఆకాశరాజై జన్మించి, తన పుత్రిక యగు పద్మావతిని శ్రీనివాసునకు యిచ్చి వివాహంచేసి ఆ చంద్రకారార్కమగు కీర్తి నార్జించెను. ముక్తి పొందెను. మాధవుని సకల పాపాలను నశింపజేసి ఉత్తమ జన్మ కలిగించుటవలన గరుడాచలమునకు "వేంకటాచలము" అను పేరు కలిగెను. అట్టి దివ్యక్షేత్రమగు తిరుమల-తిరుపతిలో వెలసి భక్తకోటిని కాపా డుచున్న శ్రీనివాసుడు ఎవరో; పద్మావతీదేవి ఎవరో, వారి దివ్యచరిత్ర ఎట్టిదో ఇక తెలిసికొనుడు. ధన్యులు కండు.

శ్రీనివాస అవతార చరిత్ర

శ్రీమంతమగు భారతదేశంలో నైమిశారణ్యం పరమ పవిత్రమైనది. అందువలన శౌనకాది మహామునులు అందరూ అచ్చటచే తపస్సుచేస్తూ ఉండే వారు, వ్యాసమహర్షి వ్రాసిన పదునెనిమిది పురాణాలను వారు సూత మహర్షివలన విని యున్నారు. ఆ పురాణాలు విని ఆనందించిన శౌన కాది మునులు ఒకప్పుడు సూత మహామునిని శ్రీనివాసుని అవర గాధలు, మహిమలు చెప్పవలసినదని కోరినారు. అప్పుడు సూత మహర్షి వారితో "మునీంద్రులారా! కలియుగంలో' మానవులను తరింప జేయుటకు శ్రీ విష్ను దేవుడు వేంకటాచలముపై శ్రీని వాసుడు అను పేరుతో అవతరించెను. శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తులకు ఏ విధమైన బాధలు కలుగకుండ కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఆయన దివ్యచరిత్ర విన్నవారికి ఇహపర సుఖాలు కలుగును. కనుక మీరందరూ భక్తిశ్రద్ధలతో వినవలసినది” అని ఈ విధంగా చెప్పెను. బ్రహ్మదేవుని కుమారుడు నారదుడు. ఆయన దేవ ఋషి, నారద మహర్షి హరినామ స్మరణజేస్తూ అన్ని లోకాలూ తిరుగుతూ అందలి ప్రజలకు దైవలీలలను తెలుపుతూ వారిలో భక్తిశ్రద్ధలు కలుగునట్లు చేయుచుండును. భక్తు లను. పతివ్రతలను, సజ్జనులను రక్షించే విషయంలోను ఆయన విష్నుమూర్తికి చేవోడు వాదోడుగా ఉండి చిన్న చిన్న తగవులు పెట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఆయన ఒకనాడు తన తండ్రియైన బ్రహ్మ దేవుని దర్శించుటకై సత్య లోకమునకు పోయెను. ఆ సమయాన బ్రహ్మ దేవుడు పద్మాసనంపై కూర్చుండి ఇంద్రాద్రి దేవతలతో ముచ్చటించుచుండెను. నారదుడు ఆ సభలో ప్రవేశించి బ్రహ్మ దేవునకూ, సరస్వతీదేవికీ నమస్కరించి నిలబడెను. బ్రహ్మ నారదుని చూచి ఆనందించి, ఆశీర్వదించి కూర్చుండమని చెప్పెమ. నారదుడు అన్నిలోక ములూ తిరుగుతూ ఉంటాడు. కావున ఆయా లోకాలలోని వింతలూ, విశేషములూ తెలుసుకొనవచ్చునని సభలోని వారంతా సంతోషపడుచున్నారు.
అట్టి సమయంలో బ్రహ్మ దేవుడు నారదునిచూచి "నాయనా! నీవు మహా భక్తుడవు కనుక నీవు ఒక మహాకార్యమును నిర్వర్తించి లోకమునకు మేలు చేకూర్చవలెను. ఆది యేమనగా, భగవంతుడగు శ్రీ మహావిష్నువుయొక్క అవ కారం కలియుగంలో లేదు. మానవులు దేవునియందు భక్తిలేక మూర్ఖులై పాపపు పనులు చేస్తూ నరకం పొందుతున్నారు. కనుక నీ నేర్పుచే యెట్ల యినను విష్ను మూర్తి భూలోకంలో అవతరించునట్లు చేయుము. అప్పుడు మానవులు దైపధ క్తి కలిగి తరింతురు" అని చెప్పెను. బ్రహ్మదేవుడు చెప్పినమాటలు నారద మహర్షికి ఆనందం కలిగిరిచి నవి. తాను ఈ పనిచేసి లోకమునకు మేలుచేయవలెనని నిశ్చయించుకొనినాడు. తండ్రివద్ద శిలవుపొంది హరినామస్మరణ చేస్తూ భూలోకమునకు బయలుదేరినాడు. అప్పుడు కశ్యపుడు మొదలగు మహామునులు గంగాతీరములో గొప్ప యజ్ఞం చేయనారంభించిరి. నారదుడు ఆ యజ్ఞశాలవద్దకు వెళ్ళినాడు. మహామునులు అందరూ నారదమహర్షిని చూచి ఎంతో ఆనందించినారు. ఆయనను ఉచితరీతిని గౌరవించినారు.
నారదుడు తన సంకల్పం నెరవేర్చుకొనుటకు అదే మంచి సమయమని నిశ్చయించుకొన్నాడు. కశ్యపాది మహామునులను చూచి "మహాత్ములారా! మీరు 'భక్తితో చేయుచున్న ఈ యజ్ఞమునుచూచి చాల సంతసించుచున్నాను. కాని నాకు ఒక సందేహం కలిగినది. అది ఏమందురా, మీరుచేసే యజ్ఞం ఏ దేవుని గురించి? ఈ యజ్ఞమునకు ఫలమిచ్చే దేవుడు త్రిమూర్తులలో ఎవరు? నేను ఎంతకాలం నుండియో యజ్ఞఫలము నొసగే దేవుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవ్వరు? యజ్ఞ ఫలము నొసగే దేవుడు ఎవరో తెలిసికొనలేక తికమక పడు చున్నాను. మహానుభావులగు మీరు నా సందేహం తీర్చి పుణ్యం కట్టుకొనుడు" అని అడిగినాడు.
నారదమహర్షి మాటలువిన్న మహామునులందరు తెల్లబోయినారు త్రిమూర్తులలో ఏ దేవుని పేరూ చెప్పుటకు సాహసించ లేకపోయారు. తగు సమా ధానం చెప్పలేక ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచుండిరి. అప్పుడు నారదముని వారినుద్దేశించి “మహాత్ములారా! త్రిమూర్తులలో సత్వగుణము కలిగి మోక్షము నిచ్చే దేవుడు ఎవరో ముందుగా తెలుసుకొని యజ్ఞ ఫలమును ఆ దేవునకు ధార పోసి మోక్షం పొందుడు" అని పలికి, వారివద్ద శలవు తీసుకొని పెళ్ళిపోయినాడు. నారద మహర్షి అచ్చటినుండి వెళ్ళిపోతూ తనలో ఇలా అనుకొనినాడు "నేను చెప్పిన మాటలను అనుసరించి ఈ మునీశ్వరులు త్రిమూర్తులను పరీక్షి స్తారు. ఆ పరీక్షలో బ్రహ్మ దేవుడూ, శంకరుడూ ఓడిపోతారు. విష్ణు దేవుడే గెలు స్తాడు. ఆ పరీక్ష సందర్భంలో లక్ష్మీదేవికీ, విష్ణుమూర్తికి అభిప్రాయభేదం కలుగుతుంది. లక్ష్మీ దేవి భర్తపై అలిగి భూలోకమునకు వెళ్ళిపోతుంది. లక్ష్మి దేవి నేడబాసి వైకుంఠమున ఉండలేక విష్ణుమూర్తికూడ భూలోకమునకు వెళ్ళి పోతారు. ఈ విధంగా విష్ణుమూర్తి భూలోకంలో వెలుస్తాడు. ఆ అవతారమును సేవించి ప్రజలు తరిస్తారు.”
నారదుడు చెప్పినమాటలు మునీశ్వరులందరకు సచ్చింది. 'భగవంతుని గొప్పతనం తెలిసికొనుట భక్తుల విధి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అను ఈ మూడు గుణములలో సత్వగుణ ప్రధానమైనదే భగవంతుని స్వరూపం. కనుక బ్రహ్మ, విష్ను, మహేశ్వరులలో సత్వగుణ ప్రధానుడైన దేవుడు ఎవరో తేల్చుకొనవలసియున్నది. మనలో ఒక మహాత్ముని పంపి త్రిమూర్తులను పరీ క్షించినయెడల మాత్రమే మన సందేహం తీరగలదు' అని తీర్మానించుకొన్నారు. త్రిమూర్తులను పరీక్షించుటన్న సామాన్యమైన పనికాదు. అందువలన ఎవరికివారే భయపడి వెనుకంజ వేసినారు. అందరునూ ఆలోచించి మహా తపస్సం సమ్నడిగు భృగు మహర్షి మాత్రమే త్రిమూర్తులను పరీక్షించుటకు సమర్ధుడని - తీర్మానించుకొన్నారు. అందరూ కలసి భృగు మహర్షిని చూచి త్రిమూర్తులను పరీక్షించి వారిలో సత్వగుణ ప్రధానుడైన దేవుడెవరో నిర్ణయించమని కోరినారు. వారి ప్రార్థనను కాదనలేక భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించుటకు బయలు దేరినాడు.

భృగుమహర్షి సత్యలోకమునకు వెళ్ళుట

భృగు మహర్షి మొదట సత్యలోకమునకు వెళ్ళెను. అప్పుడు బ్రహ్మ దేవుడు నిండుసభలో స్వర్ణ సింహాసనముపై కూర్చుండి వేద ధర్మములను బోధించుచుండెను. ఆ సభలో ఇంద్రాది అష్టదిక్పాలకులూ, ఆదిత్యాది నవగ్రహ ములూ, దేవతలు, మహాఋషులు, యక్షులు, గరుడ గంధర్వాదులు ఉన్నారు. అట్టి మహాసభలోనికి భృగుమహర్షి ఏమాత్రం భయపడక, ముందుకు వెళ్ళి బ్రహ్మ దేవుని సమీపంలో ఉన్న ఒక ఆసనముపై కూర్చుండెను. ఆయన ప్రవర్తనకు సభలో నున్నవారంతా ఆశ్చర్యపడినారు, 'ఎంత మహాముని అయితే మాత్రం, బ్రహ్మదేవునకు ఒక నమస్కారమైనా చేయకుండ నిర్భయంగా సభలో


భృగుమహర్షి సత్యలోకమునకు వెళ్ళుట ప్రవేశించి బ్రహ్మదేవుని ఆజ్ఞలేకుండా గద్దెపై కూర్చున్నాడు. ఇంత గర్వం ఉండ కూడదు' అని గుసగుస లాడుకొన్నారు.

భృగు మహర్షి ప్రవర్తన బ్రహ్మకు అవమానకరముగా తోచినది. అనుమతి లేకుండా తన సథలో ప్రవేశించుటయేగాక, సృష్టికర్తయగు తనకు సమస్కారమైనా చేయకుండ నిర్ల క్ష్యముగా ఆసనముపై కూర్చున్న ధృగుముని మీద బ్రహ్మకు ఆగ్రహము కలిగినది. కళ్ళెర్రజేసి కఠినముగా ఇలా అన్నాడు. "ఏమోయీ, భృగు! నా అనుమతిలేకుండా సభలో ప్రవేశించినావు. సరే, పోనీ పెద్దనైన నాకొక వమస్కారమయినా చేయకుండా నిర్లక్ష్యముగావచ్చి ఆసన ముపై కూర్చున్నావు. నీవు యింత గర్వముగలవాడవని నేను ఇంతవరకు అను కొనలేదు. ఇకముందైనా బుద్ధిగా ప్రవర్తించు" అని మందలించెను. బ్రహ్మదేవుని మాటలు విని భృగుమహర్షి తనలో 'ఔరా! బ్రహ్మ దేవునకు ఎంత దురభిమానము? నేను నమస్కారము చేయనంతమాత్రమున ఈయన గొప్పతనము తగ్గిపోవునా? శాంత స్వభావులకు యితరుల పొగడ్తలతో గాని, పూజలతోగాని పనియేమున్నది? ఆత్మాభిమానముగల రాజసగుణ ప్రధాను లకేగదా గర్వముండును? బ్రహ్మ దేవుడు అట్టి రాజసగుణము కలిగియున్నాడు. కనుక ఈయన యజ్ఞ ఫల మీయజాలడు' ఆసుకొని, బ్రహ్మకు ప్రత్యుత్తరము చెప్పకుండ సభనుండి వెళ్ళిపోయెను.

భృగుమహాముని కైలాసమునకు వెళ్ళుట

భృగు మహాముని కైలాసమునకు వెళ్ళుట.

శంకరుడు అన్న మాటలు విని భృగు మహర్షి బాధపడలేదు. తనలో యిలా అనుకొన్నాడు. 'ఆహా! మహా విరాగియగు నీ మహాదేవునకు ఇంత

అచ్చటినుండి ఆయన తిన్నగా కైలాసము 'వెళ్ళినాడు. శంకరుని మందిరమువద్దకు వెళ్ళి కావలియున్న వానినిచూచి "ఓయీ. పరమేశ్వరుడు ఏమి చేయుచున్నాడు? నేను ఆయనను దర్శించి మాట్లాడవలెనని వచ్చితిని. పోయి చెప్పిరమ్ము" అనగా, ద్వారపాలకుడు "అయ్యా! పరమేశ్వరుడిప్పుడు పార్వతీ దేవితో ఏకాంత మందిరమందున్నారు. మీరు ఇప్పుడు ఆయనను దర్శించుటకు వీలుకాదు. కొంత తడవు వేచియుండుడు" అని చెప్పెను. ఆ మాటల వినిభృగుముని శంకరుని పరీక్షించుటకు తగిన సమయము ఇదే అని నిశ్చయించుకొని ద్వారపాలకుడు అడ్డుచెప్పినను ఆగక చర చర లోపలికి వెళ్ళినాడు. ఆకస్మికముగా లోనికి వచ్చిన భృగుమహర్షిని శివుని ఒడి యందు కూర్చుండియున్న పార్వతీ దేవి చూచి సిగ్గుపడి ప్రక్కకు తొలగి పోయినది. ఏకాంతముగ నున్న భార్యాభర్తలను ఇతరులు చూడకూడదను సంతతి తెలిసియుండియూ మూర్ఖముగా తనవద్దకు వచ్చిన భృగుమహర్షిపై శంకరునకు విపరీతమయిన కోపము కలిగినది. భృగుమునిని చూచి కండ్లెర్రజేసి “ఓకి మూర్ఖ! భార్యాభర్తలు ఏకాంత మందిరలోనున్న సమయమున ఇతరులు ప్రవే శింపవచ్చునా? నా సేవకుడు అడ్డగించిననూ నీవు లక్ష్యపెట్టక లోనికి వచ్చినావు, ఇంతకాలము నీవు ఎంతో బుద్ధిమంతుడవని, మహాత్ముడవని గౌరవించుచున్నాను.
నీవు ఇంత మూర్ఖువడనుకొనలేదు. నీ గర్వమునకు తగిన ఫలితమనుభవించుము" అని మూడవకన్ను తెరచి తీక్షణముగా చూచెను. ఆ కంటినుండి అగ్నిజాల్వ పుట్టి భృగుమహర్షిని భస్మము చేయుటకు ఆయన సమీపమునకు పోవుచుండగా ముని శ్రేష్ఠుడగు భృగు మహర్షి తన పాదమును పైకెలి అందున్న జలనేత్రమును విప్పగా జలము బయలు వెడలి అగ్నిజ్వాలను ఆర్పివేసెను. అది గమనించి శంక రుడు ఆశ్చర్యపడి “ఓయీ, బ్రహ్మ వంశమున పుట్టినవాడవని, ఋషి శ్రేష్ఠుడవనీ దయదలచి విడిచి పెట్టుచున్నాను. పోయి బుద్ధిగా బ్రతుకుము, తక్షణము యిచ్చటి నుండి వెళ్ళిపొమ్ము" అని కఠినముగా చెప్పెను.
ఆ గ్రహము కలుగుటకు కారణము ఈయన యందున్న తామస గుణమే. తాను నగుణము గలవాడు కనుకనే సర్వజ్ఞుడై యుండియు శాంతముగా నేను వచ్చిన పని గ్రహించక ఆగ్రహించినాడు. కామసగుణ ప్రధానుడగు ఈశ్వరుడు యజ్ఞ ఫల మీయజాలడు. ఇక విష్ణుదేవుని పరీక్షించెదగాక!”

భృగుమహర్షి వైకుంఠమునకు వెళ్ళుట

ఇట్లనుకొని కైలాసమును విడిచి వైకుంఠమునకు బయలుదేరినాడు. విష్ణువుని మందిరమువద్దకు పోయినాడు. ఆ సమయమున విష్ణుమూర్తి శేష పాన్పుపై పవ్వళించి యుండెను. లక్ష్మీ దేవి ప్రక్కన కూర్చుండి ఆయన పాద ములు ఒత్తుచుందెను. ఆ సంగతి భృగుముని గమనించి వేగముగా విష్ణుదేవుని వద్దకుపోయినాడు. వెనుకముందు లాలోచించక నిద్రపోవుచున్న నారాయణుని వక్షస్థలముపై తన్నినాడు. అతని ప్రవర్తనచూచి లక్ష్మీ దేవి తెల్లబోయినది. తన్ను తిన్న నారాయణుడు త్రుళ్ళిపడి లేచినాడు. ఎదుటనున్న భృగుమహర్షిని చూచి, పాన్పుదిగి, ఆయన పాడము పట్టుకొని "మహాత్మా! మీ పాదధూళి సోకుటవలన నా దేహము పవిత్రమయినది. కఠినమగు నా దేహము తగులుటవలన కోమల మగు మీ పాదమెంత నొచ్చుచున్నచో! పాపము" అని ఆయన పాదమును వత్తుచూ "స్వామీ! మీ రాకకు కారణమిప్పుడు గ్రహించితిని. నాకు మీ పై కోపమేమాత్రము లేదు. నిశ్చింతగా ఉండుడు" అని పలికెను. చిరునవ్వు నవ్వుతూ, విష్ణుమూర్తి పలికిన మాటలు భృగుమహర్షికి శూలపుపోట్ల వలె నాటినవి. వెంటనే నారాయణుని పాదములపై పడి "దేవాది దేవా!" కృషించవలెనని వచ్చి పరమాత్ముడవైన నిన్ను తన్ని పాపము ఒడి గట్టుకున్నాను. నా అపరాధము క్షమించు నన్ను కాపాదుదు" అని వేడుకొని నారు.

భృగుమహర్షి వైకుంఠమునకు వెళ్ళుట

విష్ణుదేవుడు ఆయనను పై కెయెత్తి “భృగుమునీంద్రా! నీవు ఎట్టివాడవో
నేను యెరుగుదును. నీవు యిచ్చటికి వచ్చిన కారణము గ్రహించితిని. నీ వలన

నాకును లోకమునకు కూడ మేలు కలుగనున్నది! కాని హాని యేమీయూ కలుగ
లేదు. నీ 'పు విచారపడవలసిన పనిలేదు. నిశ్చింతగా ఉండుము అని పలికి. "నీకు
శుభమగుగాక! పోయిరమ్ము" అని ఆశీర్వదించి పంపెను.

అంతట భృగుమహర్షి వైకుంఠమునుండి సంతోషముగా బయలుదే!
యజ్ఞము చేయుటకు సిద్ధంగా నున్న మహామునుల వద్దకు పోయినాడు. జరిగిన
విషయములు వారికి వివరంగా తెలియజేసి, త్రిమూర్తులలో విష్ణుదేవుడే సత్యగుణ
సంపన్నుడని నిరూపించి పరమాత్ముడగు విష్ణుమూర్తి 'కే యజ్ఞఫలం ధారపోయించి
నాడు.

లక్ష్మీదేవి వైకుంఠమును వదలి భూలోకమునకు పోవుట

భృగుమహర్షి ప్రవర్తన చూచి లక్ష్మీ, దేవి తీవ్రమయిన ఆగ్రహం.
పొందినది. విష్ణుమూర్తిపై అలిగి “నాధా! పదునాలుగులోకములకు ప్రభువు లైన
మీ విషయం ఆ భృగుముని ఎంత పొగరుగా ప్రవర్తించినావో చూచితిరి గదా,
దేవేద్రాది సకల దేవతలచే పూజింపబడుచున్న మిమ్ము ఆదరాత్ముడు తన్నుట
కెట్లు సాహసించెనో? ఎంత అవమానకరమయిన విషయమిది! నా నివాసస్థానమగు
మీ వక్షస్థలంపై తన్నిన నన్ను తన్నినట్లేగదా? ఇట్టి మహాపరాధం చేసిన ఆ
చురాత్ముని క్షించకుండ అతని పాదమునొత్తి ఆశీర్వదించి పంపినారు. ఈ యవ
మానమును భరించి నేనిచ్చట ఉండలేను. ఆ మునిని సర్వనాశనం చేయక విడు

```
వను” అనగా, విష్ణుమూర్తి మందహాసంచేసి “దేవీ! భృగుమహర్షి దుర్మార్గుడు
గాని, పొగబోతుకాని కాడు. అతడు మహర్షి, శ్రేష్టుడు, పరమభక్తుడు. భకు
నకూ భగవంతునకూ గల సంబంధమెట్టివో తెలియక నీవు ఆయనపై కోపించి
నావు. భక్తుల మనస్సు తెలిసికొనుట చాలా కష్టం. నేను తప్ప మరొకరు ఆ విష
యం తెలిసికొనలేరు. భృగుమహర్షి ఒక గొప్ప కార్యమును సాధించుటకు అట్లు
ప్రవర్తించినాడు. కాని నా యంతటివాడు లేడని గర్వంతో చేయలేదు. భక్తులు
మనకు బిడ్డలవంటివారు. అట్టిబిడ్డలపై మనం అగ్రహించకూడదు" అని యెంక
నచ్చచెప్పిననూ లక్ష్మీ దేవి తాను పట్టిన పట్టు విడునలేదు.
“నాధా! భృగుముని చేసిన మీకు ఇష్టమైతే అగుగాక! నేను మాత్రం
సహించలేను. ఆ దురాత్ముని శిక్షించమానను. ఈ అవమానం భరించి నేను
వైకుంఠంలో ఉండలేను. ఎచ్చటికైనను పోయెదను. ఈ విధంగా మనల్ని వేరు
చేసిన ఆ బ్రాహ్మణుడు, అతని వంశంలోని వారు వేదకర్మవిహీనులై, చరి
ద్రులైన విద్యల నమ్ముకొని జీవింతురుగాక!" అని శపించి, వైకుంఠమును వదలి
వెళ్ళిపోయెను.
ఆ విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి. వైకుంఠమును వదలి
పోయి, పోయి భూలోకం చేరెను. నదీనదములు, కొండలు, గుట్టలు. పల్లెలు
పట్టణములు దాటి తుదకు గోదావరి తీరమునగల కొల్లాపురంనందు నిలిచి అచ్చట
ఒక పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేయసాగెను.
తనను విడిచి మహాలక్ష్మి వెళ్ళిపోవుటవలన విష్ణుమూర్తి మసస్సు
వికలమైపోయినది. నిద్రాహారములు మాని లక్ష్మికై పరితపించసాగెను. లక్ష్మి లేని వైకుంఠం నా కెందుకు అని దుఃఖించసాగెను. భక్తులను రక్షించు పనిని మర
చెను. వైకుంఠమును వదలి' లక్ష్మిని గూర్చి వెదకుచూ బయలుదేరెను. అన్ని
లోకములు వెదకి తుదకు భూలోకము చేరెను. "ప్రాణేశ్వరి! ఎచ్చట పున్నావు!
నీవు నన్ను విడిచిపోవడంవలన నా జీవితమే వ్యర్థమైనది. నిన్ను చూడకుంద
నేను జీవించలేను" అని చింతించుచు ఎండల కెండుచు, వానలకు తడుస్తూ కొండలు
గుహలు, వనములు వెదకుచూ కనబడిన జీవులన్నిటిని 'లక్ష్మి కనబడినదా' అని
అడుగుచూ పోసాగినాడు, ఎంత వెదకినను లక్ష్మి జాడ తెలియలేదు. ఆహార
పానీయములు లేనందున ఆయన దేహం కుష్కించిపోయినది. నిద్రలేమిచే శరీరం
తూలిపోవుచున్నది. ఇక వెదకుటకు శ క్తిలేక శేషాద్రి ప్రాంతమున నాగలక్ష్మికై
తపస్సు చేయనారంభించెను.
శేషాద్రి ప్రాంతమును గూర్చి పాఠకులు ఇంతకుముందే తెలుసుకొని
యున్నారు. నేడు తిరుమల తిరుపతి అని చెప్పుకొనబడుచున్న పర్వత ప్రాంతమే
శేషాద్రి ప్రాంతం. ఆ ప్రాంతముననే శ్రీ మహావిష్ణువు ఒక పుట్టలో కూర్చుండి.
లక్ష్మికై తపస్సు చేయుచుండెను.

వైభవమును కోల్పోయిన వైకుంఠము

లక్ష్మీనారాయణులు లేనందున వైకుంఠం దీపధూప నైవేద్యముల
లేని దేవాలయంవలె, చంద్రుడులేని రాత్రివలె శోభావిహీనమైనది. ఆ విష
యము నారదముని గ్రహించి, సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను దర్శించి
యిలా చెప్పెను: "తండ్రీ! మీరు సూచించినట్లు నారాయణుడు భూలోకమునందు

అవతరించుటకు తగు ప్రయత్నం చేశాను. అందువల్ల లక్ష్మీనారాయణులకు
ఎడబాటు కలిగినది. నారాయణుని విడిచి వెళ్ళిన లక్ష్మీదేవి కొల్లాపురంలో తపస్సు
చేయుచున్నది. నారాయణుడు శేషాద్రి ప్రాంతమున ఒక పుట్టలో దాగి తపస్సు
చేయుచున్నాడు. నిద్రాహారములు లేక శుష్కించి పోవుచున్నాడు. కనుక మీరు
ఉపాయంతో నైనను ఆయనకు ఆహారం అందునట్లు చూడవలసినది" అని
ప్రార్ధించెను.

నారదుడు చెప్పిన మాటలు విని బ్రహ్మ దేవుడు తక్షణం కైలాసము
నకు వెళ్ళెను. శంకరుడు బ్రహ్మను ఉచితరీతిని గౌరవించి, వచ్చిన కారణమేమని
ప్రశ్నించెను. బ్రహ్మ దేవుడు జరిగిన సంగతులన్నియు శంకరునకు వివరంగా
తెలియజేసి మనమిద్దరం ఆవు దూడల రూపమున భూలోమునకేగి శ్రీమన్నా
రాయణునకు పాలు యిచ్చు చుండిన బాగుండును" అని చెప్పెను, శంకరుడు అస్లే
చేయుదమనెను.

బ్రహ్మ దేవుడూ, ఈశ్వరుడూ తక్షణం బయలుదేరి కొల్లాపురంలో
తపస్సు చేయుచున్న లక్ష్మి దేవి వద్దకు వచ్చి "అమ్మా! నీవు కోపగించి తనను
విడచి వచ్చినందున నీ నాధుడు పిచ్చివాడైనాడు, నీపై బెంగకలిగి సకలలోకాలూ
వెదకి వెదకి తుదకు భూలోకం చేరినాడు. ప్రస్తుతం శేషాద్రి ప్రాంతమున ఒక
పుట్టలో తలదాచుకొనుచున్నాడు. ఆహారం లేక శుష్కించి పోవుచున్నాడు.
మేము ఆవు దూడల రూపం ధరింతుము, నీవు గొల్లభామ రూపమున మమ్ము
తీసుకొనిపోయి చోళరాజుకు విక్రయించుము, మేము ఆ రాజుయొక్క ఆవుల
మందలో ఉండి ప్రతిదినం నీ నాధునకు పాలు యిచ్చి కాపాడుచుందుము" అని
చెప్పినారు. లక్ష్మీదేవి అందుకు అంగీకరించెను.
బ్రహ్మ ఆవు రూపమును, శంకరుడు దూడ రూపమును ధరించిరి. ఆ
యావును, లక్ష్మీదేవి తోలుకొనిపోయి చోళ రాజుకు మిక్రయించి తిరిగి కొల్లా
పురమునకు పోయి తపస్సు చేసికొనుచుండెను.
చోళరాజుకు అనేక ఆవులు కలవు. ఆయన తన పళుల కాపరిని పిలి
పించి, క్రొత ఆవును దూడను అతనికి అప్పగించి "ఓకి, ఈ ఆవుదూడలను
జాగ్రత్తగా పోషించవలెను. యింత చక్కని ఆవుదూడలు మనమండలో 'లేవు,
ఈ యావుపాలు ప్రత్యేకంగా పిండి తెచ్చి మాకు యిచ్చుచుండుము" అని ఆజ్ఞా
పించెను.

పుట్టలోవున్న విష్ణుమూర్తికి క్రొత్త
ఆవుపాలు యిచ్చుట

పశువుల కాపరి ఆ యావునూ, దూడనూ తన మందలో చేర్చి శేషాద్రి
ప్రాంతమునకు తోలుకొనిపోయి మేపుచుండెను. క్రొత్త ఆవు తక్కిన పరుపు
లన్నిటితోపాటు మేత మేయక ఒంటరిగా పోయి ఏస్నుమూర్తి తపస్సు చేయు
చున్న వుట్టపై నిలిచి తన పాలను పుట్టలోనికి జారవిడుచు చుండెను. విస్ను
మూర్తి ఆ పాలను త్రాగుచు నిశ్చింతగా కాలం గడుపుచుండెను.
ఒకనాడైనను క్రొత్త ఆవుపాలు తెచ్చి యివ్వనందున చోళరాజు భార్య
పశువుల కాపరిని గట్టిగా మందలించెను. అన్ని ఆవులతోపాటు ఆ యావు పాలు
యివ్వక పోవుటకు కారణం పళువుల కాపరి గ్రహించలేక పోయినాడు. ఒకనాడు.
ఆ యావును ఒక కంట కనిపెట్టి చూడసాగెను. మామూలు ప్రకారం ఆ యాపు మందనుండి తప్పుఎంనై పూపపుదొకు పోయినది. తన పొదుగును పుట్టు పెట్టించి పాలాడల వికస సాగినది.

పుట్టలోవున్న విసృమూర్తికి క్రొత్త ఆవు పాలు యిచ్చుట -

గోపాలుడు ఆ యావు యొక్క చర్యలు గమనించి పట్టరాని కోపము
పొందెను. త సచేతియందున్న గండ్ర గొడ్డలిని పైకెత్తి ఆ యావును కొట్టబోవు


చోళరాజు ఆ క్షణంనందే పిశాచమై అచ్చటి నుండి పారిపోయెను.
గోపాలుడు మూర్ఛనుండి లేరుకున్న తరువాత గ్రుడ్డివాడయ్యెను. అతడు తన
అపరాధమును క్షమించవలసినదిగా విష్ణుమూర్తి పాదములపై పడి ఎంతో
దీనంగా వేడుకొనెను. స్వామి అతనిపై జాలిపడి “ఓరీ! త్వరలోనే నీ శేషా
ద్రిపై వెలయుచున్నాను. అంతవరకు అంధుడువై యుందువు. నా యవకారం
చూడగానే నీకు చూపు లభించగలదు. పోయి బుద్ధిగా బ్రతుకుము" అని పలికి,
తన గాయం మాన్పుటకు తగిన ఓషధికై వెదుకుచు బయలుదేరెను.

పరాహస్వామి శ్రీహరిని గుర్తించి గౌరవించుట

శ్రీనివాసుడు ఓషధికై వెదకుచు క్రమంగా కొండమీదకుపోయెను.
పోయి పోయి వరాహస్వామి ఆశ్రమం వద్దకు చేరెను. వరాహస్వామి శ్రీహరిని
గుర్తించి గౌరవించెను. జరిగిన సంగతులన్నియు దివ్యదృష్టిని గ్రహించెను.
శ్రీనివాసుని కౌగలించుకొని "సోదరా! దిక్కులేని వానివలె నీవిట్లు ఒంటరిగా
ఉండవలసిన అవసరంలేదు. నా ఆశ్రమ ప్రాంతంలో కొంత స్థలం తీసుకొని
నివసించుచు నిశ్చితంగా ఉండుము. నా వద్ద వకుళ మాలికయను భక్తురాలున్నది.
ఆమె నీకు ఏ విధమైన లోటు కలుగనీయక సంరక్షించుచుండగలదు" అని
చెప్పెను.
శ్రీనివాసుడు వరాహస్వామి మాటలు విని ఎంతో సంతోషించి
"అన్నా! 'నేను లక్ష్మీకి దూరమై ప్రస్తుతం ఆష్టకష్టములు అనుభవించుచున్నాను.

ఇట్టిస్థితిలో మీరిచ్చు స్థలమునకు ప్రతిఫలంగా ఏమియూ చెల్లించలేను; మీరు
చేయుచున్న సహాయమునకు కృతజ్ఞతగా, నన్ను చూచుటకు సచ్చు భక్తులు

వరాహస్వామి శ్రీనివాసుని గుర్తించి గౌరవించుట

ముందుగా మిమ్ము దర్శించునట్లును, మీకు పూజలు చేసి నై వేద్యం, కానుకల
సమర్పించిన తరువాతనే సాకు చెల్లించవలెనని కట్టడి చేయుదును. మీరు నాకు
చేయుచున్న సహాయమునకు ప్రతిఫలం ఇంతకంటే ఏమి యివ్వలేను" అని
చెప్పెను.
వరాహస్వామి శ్రీనివాసుని మాటలు విని సంతోషించి తన ఆశ్రమ
ప్రాంతమునగల వంద అడుగుల స్థలమును ఆయనకు ఇచ్చెను. తనను సేవించు
చున్న వకుళ మాలికను శ్రీనివాసుని సంరక్షణకై నియమించెను. వకుళ మాలిక
ఆయన గాయమునకు మందుపూసి, కట్లు కట్టి త్వరలోనే బాగుచేసెను. '
అప్పటినుండి శ్రీనివాసుడు వరాహస్వామి తనకు ఇచ్చినస్థంలో ఒక
పర్ణశాల నిర్మించుకొని నివసించసాగెను. వకుళ మాలిక ఆయనకు ఏ విధమైన
లోటు కలుగనీయక సంరక్షించుచుండెను.
ఆకాశరాజు యజ్ఞశాల కొగకు బంగారు నాగలితో దున్ని భూమిని
సిద్ధం చేయకుండా లక్ష్మీ దేవి వలె శోభించుచున్న ఒక స్త్రీ శిశువు లభించెను. ఆమె
పద్మమునందు జన్మించెను. కావున పద్మావతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా
పెంచి పెద్దగావించెను.

శ్రీనివాసుడు పద్మావతీ దేవిని చూచుట

ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత, ఒకనాడు శ్రీనివాసుడు వేటాడు.
వలెసను తలంపుతో విల్లమ్ములు చేబట్టి, గుర్రముపై బయలుదేరెను. అనేక దుష్ట
మృగములను వేటాడి ఆనందించెను.
అట్లు వేటాడుచున్న సమయమున ఆయనకొక మదగజ మెదురై
నది. శ్రీనివాసుడు ఆ యేనుగు ననుసరించి శేషాద్రికి రెండు యోజనముల దూరమున నున్న అగస్త్యాశ్రమానికి సమీపమునగల ఆకాశరాజు యొక్క ఉదా న
పసంలో ప్రవేశించెను. ఎంత వెదకినా. ఆయనకా యేనుగు కనబడలేదు. కాని చెలి

చెలికత్తెలతో మాట్లాడుచున్న శ్రీనివాసుడు

కత్తెలతో విహరించుచున్న ఆకాశరాజు కూతురు అగు పద్మావతి కనిపించింది.
చంద్రబింబము వలె శోభించుచున్న పద్మావతిని చూచి శ్రీనివాసుడు మోహరప
వశుడైనాడు. ఆమె చెంతకు పోయి తనను వివాహ మాడమని కోరినాడు.

ఆకస్మాత్తుగా కనబడిన నూతన యువకుని చూచి పద్మావతి భయ
కంపితురాలైంది. తన చెలికత్తెలతో చెప్పి ఆయనను రాళ్ళతో కొట్టించింది.
శ్రీనివాసుడు ఏమి చేయుటకును తోచక, విచారంతో తన నివాసానికి పోయేను.
నిద్రాహారములు మాని పద్మావతిని యెట్లు వివాహమాడగలనా అని చింతించు
చుండెను.

శ్రీనివాసుడు నిద్రాహారములు మాని, విచారముగా ఉండుటకు కారణం
వకుళ మాలికకు తెలియలేదు. ఆమె శ్రీనివాసుని అనేక విధముల బ్రతిమాలి
జరిగిన విషయములు తెలుసుకొన్నది. పద్మావతిని నీకిచ్చి వివాహము చేయునట్లు
ఆకాశరాజు దంపతుల నెట్లయిన ఒప్పించెదను, చింత మానుమని ధైర్యము చెప్పి
బెంగ తీర్చింది.

శ్రీనివాసుని చూచినప్పటి నుండి పద్మావతి మనస్సు ఆయనపైనే నిలిచి
పోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె ఆ రూపమును మరచిపోలేకుంది.
'అయ్యో! అతనిని రాళ్ళతో కొట్టించితిని గదా! అతనికి నాపై ఆగ్రహము కలిగి
యుండును. ఆ అందగాడు తిరిగి నాకు కనబడునో, కనబడదో? ఎంత తెలివి
తక్కువ పని చేసితిని? అతని ఊరుగాని, పేరుగాని ఎరుగను. ఇప్పుడేమి చేయు
దును' అని విచారించసాగెను. ఏ నాటికైనా అతనినే పెండ్లాడవలెనని నిశ్చయించు
కొనెను.

ఈ విధంగా పద్మావతి శ్రీనివాసునిపై మోహము కలిగి ఆయనను
చూడగల అదృష్టము ఎప్పుడు కలుగునాయని చింతించుచు మనోవ్యాధిచే మంచము
పట్టెను. ఆకాశరాజు దంపతులు ఆమె ఏనో రోగము కలిగి బాధపడుతున్న చను
కొని గొప్ప గొప్ప వైద్యులను నియమించి మందులు యిప్పించుచున్నారు. ఎన్ని
మందులు యిప్పించినా ఆమె స్థితి బాగుపడలేదు కాని దీన దినము క్షీణించిపోవు
చుండెను.

ఇట్లు జరుగుచుండగా శ్రీనివాసుడు ఎరుకలసాని రూపము ధరించి,
ఆకాశరాజు భార్యయగు ధరణీదేవి వద్దకు వెళ్ళి 'పద్మావతి మంచము పట్టుటకు
కారణము రోగము కాదనీ, ఆమె బోయవేషంతో వున్న శ్రీనివాసుడు అను
మహాపురుషుని ప్రేమించిందనీ, ఆమె నాతనికిచ్చి వివాహం చేసిన బ్రతుకగలదనీ,
లేనిచో ప్రాణత్యాగం చేయగలదని చెప్పెను.

ఎరుకలసాని మాటలు విని ధరణీదేవి చాలా భయపడింది, ద్మావతి
చెలిక తైల ద్వారా ఉద్యానవనంలో జరిగిన సంగతులు లిసికొని, ఎరుకలసాని
యధార్థమే చెప్పిందని గ్రహించింది. వెంటనే ఆ సంగతులు ఛరణగు ఆూళ
రాజు వద్దకు పోయి చెప్పింది.

ఆకాశరాజు ఆ సంగతులు విని ఆశ్చర్యానందములు పొందినాడు.
భార్యతో కలిసి పద్మావతి వద్దకు వెళ్ళి "పుత్రీ! ఈ మాత్రము దానికి నీవు ఇంతగా
బెంగ పెట్టుకొనవలెనా ? మాకు చెప్పిన యెడల నీ కోరిక తీర్చమందుమా? నీవు
ప్రేమించిన ఆ యువకుడు ఎచ్చట ఉన్నాడో వెదకించెదను. నిన్ను ఆయనకే

ఇచ్చి వివాహం చేసెదము. ఇక బెంగమాని నిశ్చితంగా ఉండుము" అని పలుకగా,
పద్మావతి చాల సంతోషించి, సిగ్గుతో తల వంచుకొనెను. ఆకాశరాజు దంపతులు
చిరునవ్వు నవ్వుకొంటూ ఆమె తల నిమిరి ముద్దులాడిరి.

అదే సమయమున శ్రీనివాసుని కోరికపై పెండ్లి రాయబారానికి
శేషాద్రి నుండి బయలుదేరిన వకుళ మాలిక ఆకాశరాజు అంతఃపురానికి వచ్చింది.
రాజదంపతులు ఆమెను ఎంతో గౌరవించి, కూర్చుండబెట్టి "అమ్మా! మీ
నివాస స్థలమేది ? మీరు యిచ్చటకు వచ్చుటకు కారణ మేమి?" అని ప్రశ్నించి
నారు.

వకుళా దేవి వారితో యిట్లు పలికింది. “మహారాజా! మీ దంపతులు
మిక్కిలి పుణ్యాత్ములు. సాక్షాత్తు లక్ష్మి దేవియే మీకు బిడ్డగా లభించింది. మీరు
త్రిలోక పూజ్యులైనారు. ఇు నేను వచ్చిన పని తెల్పెదను వినుడు.
స్థలము శేషాద్రి. నాకు శ్రీనివాసుడు అను సుపుత్రుడు`కలడు. అతడు పాతికేండ్ల
ఈడ గలవాడు. చక్కని రూపురే..లు గలవాడు. కారణాంతరముచే అతడు
అక్కికి దూరమయి ప్రస్తుకము" పేద స్థితిలో ఉన్నమాట నిజము. అవనను
ఎండ నీ కుమాకు ఏ లోటు కలుగకుండా హడగలడు. కొన్ని దిగుమ
క్రిందట నా కుమారుడు వేటకై ఈ ప్రాంతమునకు వచ్చినాడు. అప్పు
డతడు ఉద్యానవనములో విహరించుచున్న తమ పుత్రిక యగు పద్మావతిని
చూచినాడు. ఆ సుందరాంగిని చూచినప్పటినుండి అతడు ఆమెను తప్ప మరే
కన్యనూ వివాహమాడనని భీష్మించుకొని కూర్చున్నాడు. నిద్రాహారములు మాని పద్మావతి చెట్లు విణామాచూడుడునా అను చింతలో చిక్కి శల్యమయి పోవు చున్నాడు. శ్రీనివాసుడు ప్రస్తుతం ధనహీను డైనను ఆకడు సకల లోకములకు

లగ్న పేత్రికను శ్రీనివాసునకు సమర్పించు శుక మహర్షి
యేల గల సమర్ధుడు. కనుక మీ పుత్రికను శ్రీనివాసున కిచ్చి వివాహం చేయగోరు
చున్నాను" అని చెప్పెను.

ఆకాశరాజు దంపతులు ఆ మాటలు విని యెంతో ఆనందించినారు.
పెద్దలలో ఆలోచించి త్వరలోనే ముహూర్తం పెట్టించి తెలియజేయవలయునని
చెప్పి వకుళమాలికను ఉచితరీతిని గౌరవించి పంపినారు.

తరువాత, ఆకాశరాజు బృహస్పతిని, శుకమహర్షిని పిలిపించి పద్మా
వలిని శ్రీ నివాసునకు యిచ్చి వివాహం చేయుటకు సుముహూర్తం పెట్టించెను.
ముహూర్త పత్రికను శ్రీనివాసునకు శుకమహర్షితో పంపించెను. శ్రీనివాసుడు
ఆ శుభలేఖను చదువుకొని చాలా సంతోషించేను. తక్షణం బ్రహ్మ దేవుని, చింక
రుని పిలిపించి, ఆ శుభవార్తను తెలియజేసి వివాహ కార్యములు జరిపించవలసి
నదిగా కోరినాడు. కుబేరుని వద్ద పదునాలుగు లక్షల రామనిష్కములు అప్పుగా
తీసుకొని వివాహమునకు కావలసిన వస్తువాహనాదులకు వినియోగించ వలసినదని
చెప్పి యిచ్చినాడు.

శ్రీనివాసుడు పద్మావతిని వివాహమాడుట

శ్రీనివాసు డిట్లు వివాహకార్యములు జరిపించి బ్రహ్మాదిదేవతలతో
కలసి, గరుత్మంతునిపై కూర్చుండి ఆకాశరాజు నివాసస్థానమగు నారాయణ పుర
మునకు మహావైభవంగా వెళ్ళెను. వారిని చూచి ఆనంద బ్రహ్మానంద భరితు
చైనాడు. వారివారి అర్హతలకు తగిన విడిదులు యిప్పించి, సకల సదుపాయాలు
చేసినాడు. శుభముహూర్త సమయాన పద్మావతీ శ్రీనివాసుల వివాహ మతి వైభ
వంగా చేసినాడు. పిమ్మట ఆకాశరాజు సద్మావతిదేవిని శ్రీనివాసునకు అప్పగించి "స్త్రీని
వాసా! నీవు శ్రీమన్నారాయణుడవు. కాని సామాద్య మానవుడిని కావని తెలుసు

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము
కొన్నాము. పురుషోత్తముడవగు నీ పాదములు కడిగి మా పుత్రికను ఇచ్చుట
వలన మా వంశం తరించినది. మా పూర్వజన్మ సుకృతముచే భగవంతుడనై న నీవు మా అల్లుడవైతివి. అందువలన మా జన్మలు పావనమైనవి. నీరు తెలియని
ధర్మములుగాని నీతులుగాని లేవు. అయినను కన్యాదాతనైన నేను నికొక మనవి
చేసికొనుచున్నాను అదే మన, మా పద్మావతి సుకుమార, ప్రపంచ విషయాలు
అంతగా యెరగని బాలిక. ఆమెను ఏ విధంగా ఏలుకొందువో, ఏమో! స్వామీ!
పూర్వం నిన్ను రాళ్ళతో కొట్టించినదని కోపించి ఆమెను శిక్షించకు. కఠినోర్తు
లాడకు?" అని పద్మావతిని చూచి "అమ్మా! నీవు సకల శాస్త్రములు చదువుకొన్న
దానవు. సకల ధర్మములు యెరిగిన దానవు. భగవంతుని ధర్మపత్ని వగుట వలన
నీవు మిక్కిలి అదృష్టవంతురాలవు. కుమారి! నీవు సతి మాటకు యెన్నడు గాని
యెదురుచెప్పకు. సదా పలి సేవ చేయుటయందే మనస్సు నిలిపియుండుము.
పెద్దలయందు వినయ విధేయతలు కలిగివుండుము. పేదల నాదరింపుము, పుట్టింటికి,
మెట్టిన యింటికి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టుము. పేదలను, సోదలను ఆద
రించి పోషింపుము. అనసూయాది మహాపతివ్రతవలె అఖండయళి మ్యాంపుడు"
అని అనేక బుద్దులు చెప్పినాడు.
తదనంతరం ఆకాశరాజు దంపతులు పద్మావతీ శ్రీనివాసులకు వెలగల
ఆభరణాలు, వస్త్రములు పెట్టినారు. పద్మావతీదేవిని అత్తవారింటికి అతి వైభ
వంగా సాగనంపినారు. శ్రీనివాసుడు పద్మావతీ సహితంగా గరుత్మంతుని పైనెక్కి
బ్రహ్మాది దేవతలతో కలిసి ఆసందంగా తన నివాసానికి బయలు చేరినాడు.
అట్లు పోవుచున్న శ్రీనివాసునకు మార్గ మధ్యన అగస్త్య మహర్షి
ఆశ్రమము కనబడినది. తన ఆశ్రమ ప్రదేశమునకు వచ్చిన బ్రహ్మాది దేవత
వైఖానుని కోరికనిని శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి "వైథా
నసా! నీవిప్పుడు శ్రీకృష్ణావకారమును చూడలేవు. కాని శ్రీకృష్ణునితో సమాను
డగు శ్రీనివాస దేవుని చూడగలవు. శ్రీకృష్ణునకు శ్రీనివాసునకు ఏ మాత్రము
393దు షాపై మాహక్షేత్రం కడకముక వెలసియున్నాడు.
కనుక ఆ శ్రీనివాసుని పూజించి, తరించుము" అని పలికి అదృశ్యమయ్యెను.,
శ్రీహరి మాటలు విని వై ఖాసనుడు ఆనందించి అచ్చటినుండి శేషాద్రికి
పోవలెనని బయలు దేరినాడు. అట్లు పోవుచున్న వైఖానసమునికి మార్గమధ్యమున
రంగదాసు అను భక్తుడు యెదురైనాడు. అతడు వైథానసమునికి సమస్క రించి
స్వామీ! ఎచ్చటికి వెళ్ళుచున్నారు?" అని అడుగుగా, వైథానసుడు రంగదాసును
చూచి “నాయనా! నేను శేషాద్రిపై వెలసియున్న శ్రీనివాసమూర్తినిదర్శించవలెనని
పోవుచున్నాను" అని చెప్పెను.
వైఖానసుని మాటలు విని రంగదాసు ఎంతో ఆనందించి “సుహాత్మా!
తమ వెంట నన్ను కూడా తీసుకొని వెళ్ళుడు. స్వామి పూజయందు మీకు సహాయ
పడుచుందును" అని ప్రార్థించెను. వైఖానసుడు అందుకు అంగీకరించి రంగ
దాసును తనతో తీసికొని పోయెను. ఇరువురునూ కలసి కొంతకాలమునకు
శేషాద్రి చేరినారు.
వైఖానస, రంగదాసులు శేషాద్రిపై కేగి, అచ్చట వెలసియున్న
శ్రీనివాసుని దర్శించి బ్రహ్మానందభరితులైనారు. వైఖానసుడు కంగదాసును
పిలిచి "ఓయీ! స్వామిని ప్రతిదినము పూజించినయెడల ఆయన సంతోషించి
మనకు ముక్తి నిచ్చును. కనుక నీవు ఈ ప్రాంతములో ఒక పూలకోట పెంచి.
ప్రతిదినము స్వామిని పూజించుటకు పూవులు కోసి తెచుచుందుము" అని
చెప్పెను.

వైఖానసముని చెప్పిన మాటలు విని రంగదాసు ఆనందించి, ఆ
ప్రాంతంలో ఒక చక్కని పూలతోట పెంచెను. పూలతోటను పెంచుటకు నీరు
అవసరం కనుక అతడు ఒక బావిని కూడ త్రవ్వించెను.

ఈ విధంగా రంగదాసు ఒక చక్కని పూలతోటనువేసి, నిత్యము
పూవులు కోసి వైఖానసమునికి యిచ్చుచుండెను. వైఖానసుడు ఆ పూవులతో
శ్రీనివాసుని పూజించుచుండెను.

ఇట్లు జరుగుచున్న సమయమున ఒకనాడు పువ్వునుకోని వెచ్చుటకు
పోవుచున్న రంగదాసుకు మార్గమధ్యమునగల పుష్కరిణిలో జలక్రీడలాడుచున్న
గంధర్వులు కనబడిరి. వారి ఆట పాటలు చూచి రంగదాసు మైమరచి పోయెను
వారి విలాస క్రీడలు చూచిన అతని మనస్సు చలించెను. పూలుకోసి స్వామి
పూజకు అందజేయవలెనన్న సగంతియే మరచిపోయెను, గంధర్వులు మాయమై
నారు. అప్పుడు రంగదాసు తెలివికి నచ్చినాడు. స్వామి పూజకు పూవులు
అందజేయుటకు ఆలస్యమైనది గదా అని బాధపడుచు "దేవా దేవా! శ్రీనివాస
స్వామీ! నా యపరాధం క్షమించుము” అని ప్రార్థించెను.
అంతట శ్రీనివాసుడు అతనికి ప్రత్యక్షమై "కంగదాసా! చింతిలన
కుము. నీవు నా మాయా మోహముల గంధర్వుల జలక్రీడలు చూచి చలించి
నావు. అట్టి సుఖములపై భ్రాంతి పొందినావు. కనుక నీవు ఈ శరీరమును విడ
చిన తరువాత నారాయుపుకమును పాలించు సుధర్ముడను" అని పలికి అదృశ్య
మయినాడు.
ఆ రంగదాస్తే కొంతకాలమునకు సుధర్మరాజు ద్వితీయ పుత్రుడై
పుట్టెను. అతడే ఆకాశరాజు తమ్ముడగు తొండమానుడు.
పద్మావతీ శ్రీనివాసులు అగస్త్యమహాముని ఆశ్రమంలో ఉన్న సమ
యమున తొండమానుడు ఒకనాడు వారిని చూచుటకు వచ్చెను. పద్మా దేవి తన
పినతండ్రిని చూచి ఎంతో ఆనందించెను. ఆయన నెంతో గౌరవించెను. శ్రీని
వాసుడు తన ప్రియ భక్తుడుసు, చిన్న మామగారునగు తొండమానుని ఉచితిరీతిని
గౌరవించి "మీరు వచ్చిన పని ఏమిటి?" అని అడిగేను.
స్వామి మాటలు విని తొండమానుడు చేతులు జోడించి "దేవ
దేవా ! నా రాకకు ప్రత్యేక మేమియులేదు. భక్తవత్సలుడవైన నిన్నొకసారి
దర్శించవలెనని వచ్చితిని, నీ దివ్య మంగళ స్వరూపము ఎన్ని సార్లు చూచి
నను తృప్తి కలుగదు కదా! ఈ దాసునిపై సర్వదా దయయుంచవలెనని వేడు
కొను చున్నాను. నేను ఈ జన్మలో చేయడగు ఘనకార్యమేదై ఉన్నచో
విండు, చేసెదను" అని వినయంగా పలికెను. ```
తెందమానికి నచ్చినట్లు ప్రేమించె.
తొందమానరాజు మాటలు విసి ప్రేమించె...
యన్నయుగ ఆకాశరాజు ప్రేమవారసు నేను.

గావించినాడు. కాని నేను నివసించుటకు ప్రస్తుతము గృహము లేదు. కనుక ఆ
లోటు నీవు తీర్చవలెను. నేను నివసించుట కొక చక్కని ఆలయము కట్టించి
పుణ్యము కట్టుకొనుము. నీకు శాశ్వతమగు కీర్తి ప్రతిష్ట లభించగలవు”
అనెను.

శ్రీనివాసుని మాటలు విని తొండమానుడు ఎంతో ఆనందించి "స్వామి!
తమరు యెచ్చట నివసించ గోరుచున్నారో తెల్పుడు. తమ ఆజ్ఞ ప్రకారము
ఆలయ నిర్మాణము గావించెదను" అని చెప్పగా, శ్రీనివాసుడు ఆనందించి, శేషాద్రి
`పై వరాహస్వామి తనకు యిచ్చిన స్థలములో కట్టించమని పలికెను.

శ్రీనివాసుడి ఆజ్ఞానుసారము తొండమానుడు శేషాద్రిపై ఆలయము
నిర్మించుటకై వెంటనే పనివారిని, పరికరములను తెప్పించెను. స్వల్పకాలములో నే
శ్రీనివాసుడు నివసించుటకు 'ఆనంద నిలయ' మను చక్కని ఆలయమును, గోపుర
ప్రాకార మంటపములు, కొండపై కెక్కుటకు, దిగుటకు తగినట్లు మెట్లు మొద
లగు వానిని కట్టించినాడు. పూలబావిని మరింత చక్కగా తయారు చేయించినాడు.
కొండమాను రాజు కట్టించిన ఆలయాదులలో శేషాద్రి రెండవ వైకుంఠమువలె
శోభించు చుండెను.

శ్రీనివాసుడు పద్మావతీ దేవితో ఆరు మాసములు ఆనందముగా
అగస్త్యాశ్రమమునందు గడిపెను. అప్పటికి తొండమానురాజు శేషాచలము పై
తనకు ఆలయాదులు కట్టించినట్లు తెలిసికొని యెంతో సంతోషించెను. బ్రహ్మాది

దేవతలను, మహామునులను పిలిపించి 'ఆనంద నిలయ' ప్రవేశమునకు ము
హూర్తము పెట్టించెను.

పద్మావతీ శ్రీనివాసులు ఆనంద నిలయములో ప్రవేశించుట.

ఆ శుభ ముహూర్తమున సకల లోకములోని వారు శేషాద్రికి వచ్చి
నారు. పద్మావతీ శ్రీనివాసులను అత్యంత రమణీయముగ అలంకరించి మంగళ
వాద్యములు మ్రోగుచుండ, వేదమూర్తులగు బ్రాహ్మణోత్తములు మంత్రములు
చదువుచుండగా, మహర్షులు ఆశీర్వదించుచుండ, దేవతలు పుష్పవర్షము కురిపించు
చుండ ఆనంద నిలయములో ప్రవేశ పెట్టినారు. ఆ వేడుకను చూచి బ్రహ్మాది
దేవతలు యెంతో ఆనందించినారు. అప్సరసలు ఆనంద పరవశులై నాట్యము చేసి
అందరినీ ఆనందింప జేసినారు. మహర్షులు, భక్తులు శ్రీనివాస దేవుని అనేక
విధముల స్తుతించినారు.

పిమ్మట బ్రహ్మ దేవుడు శ్రీనివాసుని చూచి "దేవ దేవా! జగన్నాథా!
నాకు ఒక కోరిక గలదు. అది యేమనగా- నీ నివాస స్థానమగు ఈ వేషాచలము
నకు వచ్చి నిన్ను ఎవరు దర్శింతురో వారి సకల పాపములు తొలచునట్లు
చేయుము" అనగా, శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వి "పితామహా! నీవు కోరిన
చేయగలను" అని వరమిచ్చెను.

తదుపరి బ్రహ్మ దేవుడు శ్రీనివాసుని చూచి "శ్రీ శేషాచలేశా ! శ్రీని
వాసదేవా ! నేను నీ సన్నిధిని రెండు అఖండ జ్యోతులు వెలిగింతును, ఆ జ్యోతులు
లోక కళ్యాణార్ధము నీ సన్నిధిని సదా వెలుగుచుండ వలెను. కలియుగాంతము
వరకు నీవు ఈ పేంకటాచలముపై నివసించి భక్తులను రక్షించు చుండవలెను.
నిన్ను దర్శించు భక్తులకు ఇహపర సుఖము లొసగవలెను" అని ప్రార్థించగా,
శ్రీనివాసుడు ఆనందించి “అట్లే కాగలద”ని పలికేమ.

అంతట బ్రహ్మ దేవుడు శ్రీనివాసుడి సన్నిధిన రెండు అఖండ జ్యోతులు
వెలిగించెను. ఆ జ్యోతులు నేటికినీ శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిన వెలుగు
చున్నవి.

తదనంతరము బ్రహ్మ దేవుడు విశ్వకర్మను పిలిపించి ఉత్సవమునకు
కావలసిన రథములు, వాహనములు, ఛత్రచామరాదులు తయారు చేయించి, సకల
లోక వాసులను పిలిపించి, ఒక శుభముహూర్తమున శ్రీనివాస దేవునకు మహా
వైభవముగా బ్రహ్మోత్సవము చేసెను. సకల లోకవాసులు ఆ బ్రహ్మోత్సవము
లను చూచి పరమానంద మంది యధాశక్తి స్వామికి కానుకలు సమర్పించి తమ
తమ నివాస స్థానముల కేగిరి.

శ్రీనివాసుడు తనకు చక్కని ఆలయము కట్టించిన తొండమాను
రాజును, మహా వైభవముగా ఉత్సవము జరిపించిన బ్రహ్మ దేవుని మిగుల కొని
యాడి, వారి కోరికలు తీర్చేదెనని వాగ్ధానమిచ్చి పంపించెను. మానమయిన సంగతి మరియొకటి కలదా? ఏమైననేమి, నారాయణుడు వచ్చి నన్ను
బ్రతిమాలినంత వరకు నా పట్టుదల విడువను. నన్ను విడిచి ఉండి ఆయన మాత్ర
మేమి సుఖపడుచున్నాడు? పుట్టలో దాగి యుండి కష్టపడుచుండలేదా?” అని
పలికెను.
ఆమె మాటలువిని నారదుడు నవ్వి "తల్లీ! నీవెంత అమాయకురాలవు.
శ్రీహరికిప్పుడు ఏ కష్టమూ లేదు. ఆయన పెండ్లి చేసికొని కొత్త భార్యతో కులు
కుతూ హాయిగా కాలము గడుపుతున్నాడు. నీ కర్మయే యిట్లున్నది" అని చెప్పి
నాడు.
నారదుడు చెప్పిన మాటలు విని లక్ష్మీ దేవి కంపించిపోయినది. ఆమె
గుండె జల్లుమన్నది. కండ్లు నీటితో నిండినవి. నోట మాట రాలేదు. దుఃఖము
పొంగి వచ్చినది. ఏనాటికైనను భర్త తన వద్దకు వచ్చి గౌరవంగా తీసుకొని వెళ్ళ
గలరని కొండంత ఆశతో వున్న ఆమె ఆశలు అడియాసలై నవి. నారదుని చూ చి
“నాయనా! నీవు చెప్పిన సంగతి నిజమేనా? లేక హాస్యమున కిట్లు అనుచున్నావా?"
అని ఆతృతగా అడిగెను.
అది విని నారదుడు. "తల్లీ! నీ వద్ద అబద్ధము చెప్పుదునా? ఇది హాస్య
మాడే సమయమా? నీ కాపురమునకు ముప్పు కలుగుచున్న సమయంలో నేను పరి
హాసమాడునంత అవివేకినా? నేను చెప్పిన విషయము యదార్థము గాని, అసత్యము
కాదు" అనెను.
"అట్లయిన నాకు వారిని చూపించెదవా?" అని లక్ష్మీదేవి అడుగగా
నారదుడు "తప్పక చూపించెదను. నాతో రమ్ము" అని ఆమెను వెంటబెట్టుకొని
శేషాద్రికి పోయెను.
శ్రీనివాసుడు అప్పుడప్పుడు లక్ష్మీనిగూర్చి చింతించుచుండెను. లక్ష్మి
ఎడబాటును సహించలేకుండెను. కాని రామావకారములో వేదవతికిచ్చిన వరము
ననుసరించి పద్మావతిగా పుట్టిన వేదవతితో సంసారం చేయక తప్పదు. అయినను
లక్ష్మి నెడబాసి ఉండజాలడు. ఆమె నెట్లయినను తన వద్దకు రప్పించుకొనవలెనని
ఆలోచించుచున్నాడు కాని తగిన ఉపాయం తోచుట లేదు.


అయిన నీవే యిట్టి అధర్మానికి, అన్యాయానికి పూనుకొన్న యిక లోకంలో
ధర్మాన్ని కాపాడేవారెవరు?" అని కన్నీరు మున్నీరుగా విడుస్తూ అడిగింది. శ్రీని
వాసుడు ఏమి చెప్పుటకు తోచక మౌనముగా ఊరుకొన్నాడు.

అంతట లక్ష్మీదేవి పద్మావతిని చూచి "ఎవతెవే నీవు? నా నాధుని
ప్రక్కజేరి తగుదునమ్మాయని కులుకుచున్నావు?" అని అడుగుగా. పద్మావతీ
దేవి కోపించి" అగ్నిసాక్షిగ పెండ్లాడిన నన్నే నీవెరని అడుగుచున్నావు. నీ
వెవతపు? ఇంతకాలము అవసరము లేకపోయిన భర యిప్పుడు కావలసి వచ్చి
నాడా? సిగ్గులేక నా భర్తను నిందించుచున్నావా? వచ్చిన దారిని మర్యాదగా
తిరిగిపో"అని గద్దించి పలికెను.

పద్మావతి మాటలు విని లక్ష్మి ముఖం చిన్నబుచ్చుకొని శ్రీనివాసుని
చూచి "నాధా! నిజం చెప్పరేమి? నేను మీ భార్యను కానా? ఈమె ముందు
నన్ను అవమానింతురా-సత్యము చెప్పుడు" అని పద్మావతి దేవి అడిగినది.

ఇట్లు శ్రీనివాసుని అడుగుచు లక్ష్మీ పద్మావతులు ఒకరినొకరు
దూషించుకొనుచు. శపించుకొనుచు. చేతులు త్రిప్పుచు, మూతులు పొడుచు
కొనుచు “నా నాధుడు!" “నా నాడు!" అని శ్రీనివాసుని చెరియొక తిక్క
పట్టి లాగుచున్నారు. ఇద్దరి భార్యల మధ్య యిరుకుకొని శ్రీనివాసుడు కొంత
సేపు మౌనముగా వుండి తరువాత లక్ష్మిని చూచి యిట్లు చెప్పినాడు.

పద్మావతీదేవి పూర్వ చరిత్ర

“ప్రాణేశ్వరీ! నీకొక రహస్యమును తెల్పుచున్నాను. కోపమును
ఆవేశమును విడనాడి. `శ్రద్ధగా వినుము. ప్రియులారా! పద్మావతీ! నీవు కూడ

శ్రద్ధగా వినుము. నేను చెప్పిన విషయములు పూర్తిగా విన్న తరువాత మీరు
కొట్టుకొందురో, తిట్టుకొందురో, సఖ్యతగా ఉందురో మీరే నిశ్చయించుకొని
మీకు తోచినట్లు చేయుడు. నేను చెప్పబోవు విషయములు దివ్యజ్ఞానము కలిగిన
గాని గ్రహించజాలరు. కావున ముందుగా మీకు దివ్య జ్ఞానమును ప్రసాదించు
చున్నాను. ఇక శ్రద్దగా వినుడు" అని శ్రీనివాసుడు యిట్లు చెప్పెను.

“లక్ష్మీ! త్రేతాయుగములో నేను రామావతారమున నున్న సమయ
మున నీవు సీతవై యుంటివి. అప్పుడు నేను తండ్రి ఆజ్ఞ ననుసరించి నిన్నూ
లక్ష్మణుని వెంటబెట్టుకుని అరణ్యవాసంనకు పోయితిని, అరణ్యములో మన
మొక పర్ణశాల నిర్మించుకొని కాపురము చేయుచుండగా ఒక మాయలేడి కనబడి
నది. దానిని పట్టితేవలెనని పోయితిని. అది ఎంత ప్రయత్నించినను దొరకక
మాయచేసి పారిపోవుచున్నందున బాణం విడిచితిని. అప్పుడది చచ్చుచు నేను
అరచినట్లు "హా సీతా! హా లక్ష్మణ!" అని అరచెను. ఆ యరపువిని నీవు
నాకేదో ఆపద కలిగిందని తలచి లక్ష్మణుని పంపితిని, అదే సమయమని
దుర్మార్గుడైన రావణుడు నిన్ను యెత్తుకొని పోవుటకు ముని వేషంతో వచ్చెను.
అప్పుడు మహానుభావుడైన అగ్నిహోత్రుడు నిన్ను తనయందు దాచియుంచి
తనలో అంతకుముందు నన్ను పెండ్లాడగోరి దగ్ధమైన వేదవతిని రావణా సురు
నకు నిజమైన సీతయని నమ్మించి పట్టుబడ జేసెను.
ఆ వేదవతిని రావణుడు
సీతయని చెరబట్టెను గదా! నేను వానర సైన్యముతో సముద్రం దాటి లంక
ఏగి రావణుని వధించి సీత రూపమున నున్న వేదవతిని కాపాడితిని, లోకావ
వాదము వచ్చునని ఆ సీత రూపమును అగ్నిలో ప్రవేశించమని ఆజ్ఞాపించితిని.
అప్పుడు అగ్నిలో నీవునూ, వేదవతియు యిద్దరూ వుండగా నేను ఆశ్చర్యపడి
చూచు చుంటిని ఆప్పుడు అగ్నిహోత్రుడు నిజనృత్తాంతము నెరిగించెను గదా!
అది విని నీవు నాతో ఏమంటివో జ్ఞప్తికి తెచ్చుకొనుము.

"నాధా! ఈ వేదవతీ నా కొరకై రావణాసురుని చెలు అనుభవించి
నాకు సహాయం చేసినది, కావున ఈమెను కూడ వివాహ మాడుడు" అని
కోరితివి. అప్పుడు నేను నీతో "సీకా! నేను ఏకపత్నీ వ్రతుడను కలియుగము
నందీమెను పెండ్లాడెదను" అని నీకు చెప్పి నిన్ను తృ పి పి పరిచితిని గదా!
ఆనాటి వేదవతియే యిప్పుడీ పద్మావతిగా అవతరించినది. ఇప్పుడు నీకా
వృత్తాంత మంతయు చక్కగా తెలిసినది. ఆడినమాట తప్పరుండ నా ధర్మ
మును నేను నిర్వర్తించితిని. ఇందు నా తప్పేమున్నచో చెప్పుము" అని
యడిగెను.

భర్త చెప్పిన మాటలు విని లక్ష్మీ దేవి శాంతించినది. పద్మావతిదేవి
సిగ్గుతో తలవంచుకొన్నది. భగవానుడిచ్చిన దివ్యదృష్టితో తమ పూర్వజన్మ
వృత్తాంతములు తెలిసికొని ఆనందించిరి. లక్ష్మీదేవి పద్మావతిని కౌగలించుకొని
"చెల్లెలా! అజ్ఞాన వశమున నిన్ను పరస్త్రీవని భావించి నిందించితిని, అన్యధా
భావించకుము" అనగా, పద్మావతి నవ్వి "అక్కా! నిన్ను యెదిరించి మాట్లాడి
నందుకు నీవు నన్ను క్షమించవలెను" అని కోరెను.

సవతు లిద్దరి మధ్య సఖ్యత కలిగినందుకు శ్రీనివాసుడు ఎంతో
ఆనందించెను. లక్ష్మీదేవిని కౌగలించుకొని తన వక్షస్థలమున చేర్చుకొనెను.
భార్య లిద్దరితో కలిసి భగవంతుడు ఆనందించుచు భక్తులను కాపాడసాగినాడు.
కలియుగ ప్రత్యక్షదైవమని, పిలిచిన పలికేడి దేవుడని ప్రసిద్ధి పొందినాడు.

ఆ శ్రీనివాసుడే నేడు శ్రీ వెంకటేశ్వరుడు. ఏడుకొండలవాడు.
బాలాజీ, తిరుమలేశుడు మొదలగు అనేక పేర్లతో పిలువబడుచున్నాడు. భక్తుల
పాలిటి కల్పవృక్షమై ప్రకాశించు చున్నాడు.

శంఖణుని కథ

పూర్వము శంఖణుడను రాజు ఉండెను. అతడు కాంభోజ దేశమును
పాలించెను. అతడు ధర్మము తప్పక రాజ్యమును పాలిస్తూ మంచి పేరు
పొందెను.
శత్రురాజులు కొందరు శంఖణుని పేరు ప్రతిష్టలు చూచి అసూయ
పడుతున్నారు. అందరును కలసి శంఖణుని మీదికి దండెత్తి వచ్చిరి. శంఖణుడు
వారి నెదుర్కొని పోరాడెను. కానీ తన సైనికుల కంటె పదింతలుగ నున్న శత్రు
సైనికులతో ఎక్కువ కాలం పోరాడలేక పోయెను. తుదకు శంఖణుడు ఒడిపోయి
రాజ్యమును విడిచి భార్యతో అరణ్యంనకు పారిపోయెను.
తరువాత శంఖణుడు సతీసమేతంగ రామేశ్వరము మొదలగు పుణ్య
క్షేత్రంలు దర్శించి తుదకు అలివేలు మంగాపురం చేరెను. అచ్చటి పద్మ సరోవర
తీర్థంలో నిత్యము స్నానం చేయుచూ తనకు కలిగిన దుస్థితికి విచారిస్తుండెను.
అప్పుడొకనాడు ఆకాశవాణి శంఖణు నుద్దేశించి "మహారాజా!
విచారించకుము, శ్రీ వేంకటాచలమునకు వెళ్ళి అచ్చటి పుష్కరిణిలో,
స్నానంచేసి శ్రీ వేంక టేశ్వరుని పూజింపుము. నీకు రాజ్యప్రాప్తి కలుగును”
అని చెప్పెను.
ఆకాశవాణి మాటలు విని శంఖణుడు సతీసమేతంగా వేంకటాచలమున
కేగి, పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వేంకటేశ్వరుని తులసితో పూజించెను.
స్వామికి అతనిపై అనుగ్రహం కలిగి "రాజా! నీకు త్వరలో రాజ్య ప్రాప్తి
యగును. దుఃపడకుము" అని చెప్పెను.
శంఖణుడు అచ్చటినుండి బయలు దేరి కొన్నాళ్ళకు తన రాజ్యంచేరెను.
దైవంపై భారం వేసి శత్రువులతో పోరాడి రాజ్యంనుండి తరిమి వేసెను. తిరిగి
సింహాసన మధిష్టించి రాజ్యపాలన చేసి పేరు పొందెను.

పసువు చరిత్ర

శ్రీ వేంకటాచలంనందు వసువు అను బోయవాడు నివసించు చుండెను..
వాని భార్య చిత్రావతి. వారు ఆ కొండపై అన్యోన్యానురాగములు కలి. హాయిగా
కాపురం చేయుచుండిరి.
వసువు జంతువులను వేటాడు కిరాతుడైనను గొప్పదైవభ క్తి గలవాడు.
అతడు ప్రతిదినం ఆ కొండపై లభించు వెదురు బియ్యము తెచ్చి భార్యకిచ్చి
వండించును. దానిలో పుట్టతేనే కలిపి తాము నివసించు చెట్టు క్రిందనున్న రాతి
బొమ్మను శ్రీ వేంక టేశ్వరునిగా భాసించి, పూజించి, నై వేద్యం పెట్టి భార్యకు పెట్టి
తాను తినుచుండెను.
ఒక చక్కని
ఇట్లు జరుగుచుండగా చిత్రవతి గర్భవతి యయ్యెను.
కుమారుని కనెను. వానికి సువీరుడు అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద
గావించిరి. క్రమంగా సువీరుడు పండ్రెండేండ్ల వాడయ్యెను.
ఒకనాడు వసువు తేనే తెచ్చుటకు అడవికి పోయెను. చిక్రావతి తేనే
తెచ్చుట లోపల అన్నం చెట్టు క్రింద వున్న దేవునకు ఆరగింపుచేసి తాను భుజిం
చెను.
కొంత సేపటికి వసువు యింటికి వచ్చెను. తేనెలేకుండ స్వామికి అన్నం
పెట్టిన సంగతి తెలుసుకొని కొడుకుపై పట్టరాని కోపం పొందెను. కత్తి పట్టి
కొడుకును చంపబోవుచుండగా “ఓయీ, శాంతించుము. నీ వలెనే నీ పుత్రుడు
కూడా నాకు పరమ భక్తుడు. తేనె లేనంత మాత్రమున భక్తికి లోటు కలుగదు.”
అని వేంక టేశ్వరస్వామి ఫలికి వారి కుటుంబమునకు మోక్షమిచ్చెను.
భక్తులను కాపాడుటలో శ్రీ వేంకటేశ్వరుడు తనకు తానే సాటియని
పించుకొనుచుండెను.

కుమ్మ ర దా సు

వేంకటాద్రికి ఆమడ దూరమున ఒక పల్లె కలదు అందు భీముడు అను
నొక కుమ్మరి కలడు. అతని భార్యపేరు తమాలిని. ఆ దంపతులు శ్రీ వేంక టేశ్వ
రుని పరమభక్తులు.
భీముడు కుండలు చేయు మన్ను త్రొక్కుచున్నప్పుడు, సారె త్రిప్పు
నప్పుడును, కుండలు కాల్చునప్పుడును, యెల్ల వేళలందు శ్రీ వేంక టేశ్వర నామ
స్మరణ చేయుచుండెను. అతని భార్య యగు తమాలిని కూడ ఎల్లప్పుడు శ్రీ
వేంకటేశ్వర నామస్మరణ చేయుచు తనకు ఉన్నంతలో బీడలకు కొంత పెట్టుచు
భర్తతో ఆనందంగా కాలం గడుపు చుండెను.
కుమ్మరదాసు తనయింటిలో మట్టితో సింహసనంచేసి, మట్టితోనే
వేంకటేశ్వర విగ్రహం తయారుచేసి, సింహాసన మందుంచి నిత్యం పూజించు
చుండెను. ఒక్కొక్కప్పుడు కుండలు చేయుచు హరినామస్మంణలో మునిగి
మైమరచి పని మరచిపోవుచుండెను. కాని దైవాను గ్రహంవలన అతని పనులకు
ఎట్టి భంగము కలుగకుండెను.
వేంకటాచలమున శ్రీ వేంటేశ్వరుని సేవించుచున్న తొండమానునితో
స్వామి కుమ్మరదాసు దంపతుల భక్తిని గూర్చి చెప్పగా తొండమాను వారిని
చూడవలెనని పరుగు పరుగున ఆ పల్లెకు పోయెను. పరుగు వలన మికిలి
అలసి కుమ్మరదాసు ఇంటి వాకిట పడి మూర్ఛపోయెను. కుమ్మరిదాసు మట్టి
పాత్రతో నీరు తెచ్చి తొండమానుని ముఖంపై జల్లెను. కొంతసేపటికి తొండ
మానుడు మూర్ఛనుండి తేరుకుని లేచెను. అట్టి సమయమున శ్రీ వేంక టేశ్వర
స్వామి అచ్చట ప్రత్యక్ష మయ్యెను. స్వామిని చూచి వారందరూ ఆనంద
పరవశులై రి.

తమాలిని స్వామికిమట్టి పీఠంవేసి కూర్చుండబెట్టి, మట్టిచెంబుతో మంచి
నీరు యిచ్చి, మట్టి పాత్రలో భోజనం వుంచి “స్వామి! నిరు పేదలము. మాకున్న"
యిదే! క్షమించి విందారగింపుడు" అని ప్రార్థించెను.

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆనందించి, తృప్తితో ఆ పదార్థములు
భుజించెను. ఇంతలో దైవానుగ్రహంవలన దేవవిమానము అచ్చటికి వచ్చెను.
స్వామి కుమ్మరిదాసు దంపతులను అందు కూర్చుండజేసి స్వర్గమునకు పంపెను.

చూచితిరా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తరక్షణము.
తిరుమల - తిరుపతి శ్రీ వేంక టేశ్వరలీలలు

సంపూర్ణ ము

శ్రీ వేంకటేశ మంగళా శాసనము

శ్రీ యః కాంతాయ కల్యాణ నిధయే నిధయే ర్ధనామ్ ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
లక్ష్మి సవిభ్రమా లోక సుభ్రూ విభ్రూమ చక్షుసే |
చక్షుసే సర్వ లోకానాం వేంక టేశాయ మంగళమ్ ||
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళా భరణాం ఘ్రయే ॥
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
సర్వాయవ సౌందర్య సంపదా సర్వ చేతసామ్ !
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్ ||
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే |
సర్వాంత రాత్మనే శ్రీ మద్వేంక టేశాయ మంగళమ్ ||
స్వతస్సర్వవిదే సర్వశ క్తియే సర్వ శేషిణే |
సులభాయ సుశీలాయ వేంక టేశాయ మంగళమ్ ॥
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ||
అకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ |
అతృప్త్య మృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ ||
ప్రాయస్స్వ చరణా పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయా 2 దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ॥

శ్రీ వేంకటేశ మంగళా శాసనము

శ్రీ యః కాంతాయ కల్యాణ నిధయే నిధయే ర్ధనామ్ ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
లక్ష్మి సవిభ్రమా లోక సుభ్రూ విభ్రూమ చక్షుసే |
చక్షుసే సర్వ లోకానాం వేంక టేశాయ మంగళమ్ ||
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళా భరణాం ఘ్రయే ॥
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
సర్వాయవ సౌందర్య సంపదా సర్వ చేతసామ్ !
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్ ||
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే |
సర్వాంత రాత్మనే శ్రీ మద్వేంక టేశాయ మంగళమ్ ||
స్వతస్సర్వవిదే సర్వశ క్తియే సర్వ శేషిణే |
సులభాయ సుశీలాయ వేంక టేశాయ మంగళమ్ ॥
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ||
అకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ |
అతృప్త్య మృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ ||
ప్రాయస్స్వ చరణా పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయా 2 దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ॥


శ్రీ వేంకటేశ్వర లీలలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.